హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడంతో ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుంటుంది హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఇటీవల నితిన్, భీష్మ లో  ఏమాత్రం ప్రాధాన్యత  లేని పాత్రలో కనిపించింది హెబ్బా దాంతో సినిమా హిట్ అయినా కూడా ఆమె పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇక ఈసినిమా తరువాత హెబ్బా కు మరో ఆఫర్  వచ్చింది అయితే ఈసారి ఐటెం సాంగ్ లో నటించడానికి ఓకే చెప్పింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్.  ఈచిత్రంలో హెబ్బా ఐటెం సాంగ్ లో రామ్ తో కలిసి స్టెప్పులు వేయనుందని సమాచారం. మణిశర్మ ఈ పాటకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట. 
 
నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. కొద్దీ రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ డీసెంట్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. రామ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రామ్ సరసన నేల టిక్కెట్టు ఫేమ్ మాళవిక శర్మ,  నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా బిగిల్ ఫేమ్ అమ్రితా అయ్యర్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న  విడుదలకానుంది.
 
రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో నేను శైలజ ,ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలు తెరకెక్కాయి. ఇక గత ఏడాది చిత్రలహరి తో కిషోర్ ఫామ్ లోకి రాగ ఇస్మార్ట్ శంకర్ తో వచ్చి కెరీర్ లో మొదటి  బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు రామ్. మరి ఇప్పుడు రెడ్ వీరికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: