మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక‌ కుమార్తె కూడా ఉంది. ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు మరో హీరో వివేక్ ఒబెరాయ్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. ఆ టైంలో సల్మాన్, ఐశ్వర్యం మానసికంగా హింసించడంతో సల్మాన్ కు దూరమై వివేక్ ఒబెరాయ్ దగ్గరయింది. వివేక్ కూడా ఆమె ప్రేమాయణం మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది.

 

ఆ తర్వాత అందరికి షాక్ ఇస్తూ అభిషేక్ బచ్చన్ను పెళ్లాడింది. 2007లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి కొద్ది రోజుల ముందు ఐశ్వర్యరాయ్ హృతిక్ రోషన్‌తో ధూమ్2 సినిమాలో నటించింది. ధూమ్ టు సినిమా లో ఐశ్వర్యారాయ్ మరీ బరితెగించి చేసి ఎక్స్‌పోజింగ్ చేసింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో గాఢమైన ముద్దు సీనుల్లో నటించింది. ఈ ముద్దు సీను టోటల్‌గా సినిమాకి హైలెట్ గా నిలిచింది.

 

అప్పటికే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఆ టైమ్‌లోనే ఐశ్వర్య ఇంత ఘాటు ముద్దు సన్నివేశంలో నటించడానికి అభిషేక్ బచ్చన్ తో పాటు టోటల్ గా ఫ్యామిలీ ఫీల్ అయింది అన్న వార్తలు వినిపించాయి. అభిషేక్ అభిమానులు సైతం  ఐశ్వర్య చేసిన పనికి ఫీల్ అయ్యారు. ఆ లిప్ లాక్ అప్పట్లో పెద్ద సంచలనం అవడంతో పాటు జాతీయ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. దాంతో చాలా రోజులు ఆ  ముద్దు సీన్‌ని ప్రేక్ష‌కులు కూడా మ‌ర్చిపోలేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: