టాలీవుడ్ లో యువసామ్రాట్ అక్కినేని నాగార్జునను అందరూ మన్మధుడు అని పిలుస్తారు. నాగార్జున తండ్రి దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరో అయినా.. నాగార్జున తండ్రి బాటలోనే నడుస్తూ కెరీర్ స్టార్టింగ్ నుంచి రొమాంటిక్ హీరో అన్న ముద్ర వేయించుకున్నాడు. గీతాంజలి, మజ్ను, నిన్నే పెళ్లాడతా ఎలా వరుసగా ప్రేమకథల్లో నటించిన నాగార్జున మన్మధుడు సినిమా తర్వాత ఎంతో మంది అమ్మాయిల మదిలో మన్మధుడు అన్న ముద్ర వేయించుకున్నాడు. అప్పట్లో నాగార్జున సినిమా వస్తుందంటే తొలిరోజు తొలిఆట‌ చూసేందుకు ఎంతో మంది అమ్మాయిలు సైతం క్యూలో ఉండేవారు.

 

2002 డిసెంబర్లో వచ్చిన మన్మధుడు సినిమాకు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు. నాగార్జున సరసన సోనాలి బింద్రే అన్షు హీరోయిన్ లుగా నటించారు.  ఈ సినిమా 12 సంవత్సరాల తర్వాత నాగార్జున మన్మధుడు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమాలో నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయింది.


 మన్మధుడు 2 సినిమా ఘోరమైన డిజాస్టర్ టాక్‌తో నాగార్జున పరువు కాస్తా తీసేసింది. నాగార్జున గతంలో ఎంతో మంది హీరోయిన్లతో రొమాన్స్ చేసిన ఇలాంటి విమర్శలు రాలేదు. అయితే మన్మధుడు2 సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన ఘాటు రొమాన్స్ తో పాటు గాఢ‌మైన ఆ లిప్ లాక్‌ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

 

 నాగార్జున మితిమీరి పోయి తాను సీనియర్ నటుడు అన్న విష‌యాన్ని మర్చిపోయి చాలా ఘోరంగా రకుల్ ప్రీత్ సింగ్ తో ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించేశారు. ప్రేక్షకులు అసహ్యించుకుని సినిమా అట్టర్ ఫ్లాప్ చేశారు. అప్పటికే నాగార్జున కుమారుడు నాగ చైతన్య తో క‌లిసి రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించింది. నాగార్జున ఇప్పుడు తన కొడుకు చేసిన ఘాటు రొమాన్స్ చేయడం ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమా ఘోరంగా అవ్వటం ఒక దెబ్బ అయితే నాగార్జున పరువు తియ్యటం వ్యక్తిగతంగా ఆయనకు మైనస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: