కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్నాడు. అప్పట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురం లో సినిమా ఓకే చేయడంతో విక్రమ్ కుమార్ ప్రాజెక్టు పక్కకు తప్పుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ డ్యాన్స్ అవకాశం ఇస్తాడా అని భావించిన అవకాశం మళ్ళీ రాలేదు. దీంతో కొత్త హీరో వెతికే పనిలో విక్రమ్ కె కుమార్ పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కినేని ఇంట ఫ్యామిలీ డైరెక్టర్ గా ‘మనం’ మరియు ‘హలో’ లాంటి సినిమాలు తెరకెక్కించిన విక్రమ్ మళ్ళీ మూడోసారి అక్కినేని హీరోని లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

గతంలో అక్కినేని ఇంటిలో ఫ్యామిలీ హీరోలందరితో మనం సినిమా చేసే అదిరిపోయే హిట్ అందుకున్న విక్రమ్ తర్వాత అక్కినేని అఖిల్ తో చేసిన హలో సినిమాతో పరాజయం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి అక్కినేని నాగచైతన్యతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అంతా ఓకే అయినట్లు ఈ నెలాఖరులోనే సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం నాగ చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌ స్టోరీ’ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా అయిన వెంటనే గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో నాగేశ్వరరావు అనే సినిమా చేస్తుండగానే తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కూడా చైతన్య సినిమా ఒప్పుకోవడంతో ఈ వార్త ఫిలింనగర్లో హైలెట్ న్యూస్ గా మారింది. త్వరలోనే 'లవ్ స్టోరీ' సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత వెంటనే విక్రమ్ కుమార్ తో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అక్కినేని కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంలో అక్కినేని ఇంటికి విక్రమ్ కె కుమార్ ఫ్యామిలీ డాక్టర్ లాగా మారిపోయాడు అని అంటున్నారు నెటిజన్లు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: