ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలు కొంత పరిశీలిస్తే, ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు లిప్ లాక్ సీన్లు వంటి అంశాలు లేనిదే కొందరు ప్రేక్షకులు సైతం సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్లో శృంగార సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ వంటివి సినిమాల్లో జోడించడం ఎక్కువైంది. ఇక మన తెలుగు సినిమాల పరిస్థితికి వస్తే ఎక్కువగా అక్కడక్కడ కొందరు హీరోల సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. 

 

ఇక సినిమాల్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరినొకరు ముద్దాడే లిప్ లాక్ సన్నివేశాలు మనం తరచు అక్కడక్కడా చూస్తుంటాం. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇటీవల కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు2 సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకానొక సందర్భంలో నటి ఝాన్సీని ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే సినిమా రిలీజ్ సమయంలో ఆ సన్నివేశం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. 

 

హీరోయిన్ పాత్రధారి ఆ విధంగా మరొక నటిని ముద్దాడటం దేనికి నిదర్శనం అంటూ కొందరు బహిరంగంగానే దర్శకుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. సాధారణంగా హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒక సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటిస్తే చూడాలనిపిస్తుందని, కానీ ఈ సీన్ చూస్తుంటే గతంలో షబానా అజ్మి, నందిత దాస్ ల కలయికలో వచ్చిన ఫైర్ సినిమానే గుర్తుకువచ్చిందని,  ఛీ, ఛీ మన కర్మ కాకపోతే ఇటువంటి దరిద్రపు సన్నివేశాలను చూడాల్సిన దుస్థితి మనకు దాపురించిందా అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్ చేసిన వారు కూడా ఉన్నారు. మరి దర్శకుడికి ఎందుకని అలాంటి సన్నివేశం పెట్టాలని అనిపించిందో ఏమో గాని, ఆ సీన్ వల్ల సినిమాపై కొంత మేరకు నెగటివిటీ వచ్చిందని అన్నవారు కూడా ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: