దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి భర్త అయిన బోనీకపూర్ మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో సుపరిచితం. మొదటి నుండి బాలీవడ్ లో పలువురు బడా స్టార్లతో సినిమాలు నిర్మించి ఎన్నో సక్సెస్ లు అందుకున్న బోనీ, ఆ తర్వాత శ్రీదేవి ని రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల బాలీవుడ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీని తెలుగు రీమేక్ అయిన వకీల్ సాబ్ మూవీని, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో కలిసి తెరకెక్కిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన రాబట్టడం జరిగింది. అలానే మరోవైపు బోనీ అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరో తల అజిత్ తో కలిసి వాలిమై అనే సినిమాను నిర్మిస్తున్నారు. హెచ్ వినోద్ రచన, దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అజిత్ అభిమానులు నేడు, వరస్ట్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ అనే పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో దానిని ఎంతో వైరల్ చేస్తున్నారు. 

 

మేము ఎన్నో రోజులుగా మా హీరో సినిమా కోసం ఎదురు చూస్తుంటే, కనీసం ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం దారుణమని, కాబట్టి ఇకనైనా నిర్మాత బోనీకపూర్ కళ్ళు తెరిచి తమ హీరో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ని అందించాలని అజిత్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి దీనితో అయిన నిర్మాత బోనీ లో చలనం వచ్చి వాలిమై మూవీ అప్ డేట్ ఇస్తారో లేదో చూడాలి....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: