లిప్ లాక్  సీన్స్ తో సినిమాలు తీస్తే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతాయి అన్న నమ్మకంలో చాలా రోజులు దర్శక నిర్మాతలు ఉన్నారు. అయితే ప్రస్తుతం మారిన ట్రెండ్ లో సరైన కథ లేకుండా లిప్ లాక్ ఉంటేనే సినిమాలు చూస్తారు అనుకోవడం పిచ్చి భ్రమ. యూత్ ఐ కాన్ గా పిలవ బడుతున్న విజయ్ దేవరకొండ సినిమాలను లిప్ లాక్ సీన్స్ ఉన్నా ఘోరమైన ఫ్లాప్ లుగా మారిన పరిస్థితి. 


అయినా ఈ విషయాలు పట్టిచుకోకుండా హీరోయిన్స్ బోల్డ్ సీన్స్ తో  లిప్ లాక్ సీన్స్ తో సినిమాలు తీస్తే కలక్షన్స్ వచ్చి పడిపోతాయి అన్న భ్రమతో అనేకమంది దర్శకులు సినిమాలు తీస్తున్నారు. అయితే ఈ లిస్టులో ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడ చేరిపోవడం అత్యంత దురదృష్టకరం. తన కొడుకు ఆకాష్ హీరోగా నిలబెట్టాలి అన్న ఒకేఒక అత్యఆశతో పూరీ లేటెస్ట్ గా తీస్తున్న రొమాంటిక్ మూవీ ఫస్ట్ లుక్ ఆమధ్య విడుదలైంది. సినిమాను హిట్ చేయడం కోసం పూరీ కూడ ఇంత దారుణంగా మారిపోయాడా అంటూ విమర్శలను ఎదుర్కున్నాడు.

 

బోల్డ్ సీన్స్ తీయడంలో పూరీ జగన్నాథ్ స్టైల్ వేరు ఆ స్టైల్ ను నమ్ముకుని పూరీ తన కొడుకు కోసం కేతికా శర్మ అన్న కొత్త హీరోయిన్ ను తీసుకువచ్చి ఆమెను ఎంత వరకు ఎక్స్ పోజ్ చేయాలో అంత వరకు ఎక్స్ పోజ్ చేస్తూ ఆ విధంగా అయినా తన కొడుకును టాలీవుడ్ లో నిలబెట్టాలని పూరీ సూచనలతో ఈ మూవీకి అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

వాస్తవానికి టాప్ డైరెక్టర్స్ గా ప్రస్తుతం పరిగణింప బడుతున్న రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల అనీల్ రావిపూడి సినిమాలలో లిప్ లాక్ సీన్స్ కనిపించవు. అయినా ప్రేక్షకులు వీరి సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే కథాంశం లేకుండా కేవలం యూత్ ను రెచ్చకొట్టే లిప్ లాక్ సీన్స్ పెట్టి సినిమాలను హిట్ చేయాలి అని భ్రమలో ఉన్న ఎందరో దర్శకులు అడ్రెస్ లేకుండా పోయారు. ఈ విషయాలు అన్నీ తెలిసి కూడ పూరీ తన కొడుకు కోసం మెట్టుదిగి చేయిస్తున్న ఈ ప్రయోగం సమాజానికి దురదృష్టకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: