మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 'అ..ఆ' తర్వాత ఇన్నాళ్ళకి 'భీష్మ' సినిమాతో హిట్ దక్కించుకున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో 50 కోట్లును సాధించింది. ఇదే ఊపుతో బాలీవుడ్ సినిమా రీమేక్‌తో ప్రయోగం చేయాబోతున్నాడు నితిన్. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా  'అంధాదున్' సినిమాలో నటించాడు. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ ని దక్కించుకుంది. అందుకే ఈ సినిమాతో నితిన్ టాలీవుడ్ లో పెద్ద ఎక్స్‌పరిమెంట్ చేయబోతున్నాడు.

 

'అంధాదున్' ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే జంటగా టబు విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ జనాలకి కావలసినట్టుగా మాంచి సెక్స్ సీన్స్  ఉన్నాయి.. హీరో.. హీరోయిన్ కళ్లకు గంతలు కట్టి మరీ రొమాన్స్ చేసిన సీన్స్ అక్కడ ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అలాంటి సీన్లు బాలీవుడ్, హాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. కానీ తెలుగులో అలాంటి సీన్స్ చూడటానికి జనాలు ఎంతవరకు సిద్దంగా ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీన్స్ ని ఇష్ఠపడతారా అన్నది ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ కి వచ్చిన అనుమానం. 

 

అయితే ఈ సెక్స్ సీన్లకు సంబంధించి చిత్ర యూనిట్ లో కొన్ని చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. హిందీ వెర్షన్‌లో సెక్స్ సీన్లు ఉన్నప్పటికీ.. తెలుగులో అలాంటి సీన్స్ తీయకూడదు కాబట్టి, అందులోనూ నితిన్ లాంటి హీరో ఇలాంటి సెక్స్ సీన్స్ ని చేయిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రారు కాబట్టి ఈ సీన్స్ ని తీసేసి వాటి ప్లేస్ లో వేరే సీన్స్ ని పెడదామని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట. మరి ఫైనల్ గా ఏం చేస్తారో చూడాలి. ఇక త్వరలో నితిన్ పెళ్ళి చేసుకోబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సీన్స్ లో నటించే అవకాశాలు లేవని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: