లిప్ లాక్ ట్రెండ్ కాస్త టాలీవుడ్ కి కూడా పాకిపోయింది. ప్రస్తుతం ప్రతి సినిమాలో లిప్ లాక్ లు  ఉండాల్సిందే. కాదు కాదు లిప్ లాక్ లేని సినిమా లేదు అని చెప్పాలి. ఒకవేళ లిప్ లాక్ లేకపోతే సినిమా చూసే ప్రేక్షకులు అందరూ ఏదో మిస్ అయింది అని ఫీల్ అవుతూ ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో ఆ కెమిస్ట్రీలో లిప్ లాక్  ఉండడం కూడా అంతే ముఖ్యం అంటుంటారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకులు కోరుకున్నదే కదా  దర్శకులు హీరో హీరోయిన్స్ కూడా చేయాల్సింది. అందుకే అందరూ లిప్ లాక్  లకు కూడా సై అంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా లిప్ లాక్ మాత్రం కామన్ గా ఉండిపోతున్నాయి. ఇక చిన్న హీరోల సినిమాల్లో అయితే అబ్బో అవి లిప్ లాక్ లు  అనడం కంటే అంతకుమించి అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 అయితే ప్రస్తుతం ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఎన్నో లిప్ లాక్ సీన్లు కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని లిప్ లాక్ సీన్లు వచ్చినప్పటికీ కొన్ని లిప్ లాక్ సీన్లు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయినా లిప్ లాక్ సీన్లలో... ముందుగా అందరికీ గుర్తొచ్చేది.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మధ్య ఉండే లిప్ లాక్ సీన్. విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన గీత గోవిందం సినిమా గణ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

 

 

 ఏకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ రష్మిక మందన లను  వందకోట్ల హీరోహీరోయిన్లుగా మార్చేసింది . అయితే ఈ సినిమాలో రష్మిక మందన విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ అందరికీ ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. రష్మిక మందన కి విజయ్ దేవరకొండ కి పెళ్లి అయిన తర్వాత... బస్సులో వెళుతున్న సమయంలో.. పెళ్లికూతురు డ్రెస్ లో ఉన్న రష్మిక విజయ్ దేవరకొండ ఒడిలో కూర్చొని... ఒక ట్రెడిషనల్ లిప్ లాక్  ఇస్తుంది. అయితే ఈ లిప్ లాక్ కాస్త హాట్ గానే ఉన్నప్పటికీ.. పెళ్లయిన తర్వాత ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న వారిద్దరూ... లిప్ లాక్ చేసుకోవడంతో ఈ లిప్ లాక్ కాస్త ట్రెడిషనల్ గా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: