పవన్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన రావడంతో ఇప్పటి వరకు ఈ సినిమా మార్కెట్ గురించి కనీసం ఎంక్వయిరీలు కూడ చేయని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ కోసం దిల్ రాజ్ తో తమకు ఉన్న పరిచయాలురీత్యా ఎంక్వయిరీలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ రైట్స్ కు సంబంధించి దిల్ రాజ్ కోట్ చేస్తున్న రేట్లు విని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు భయపడిపోతున్నట్లు టాక్.


మే నెలలో సమ్మర్ ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ మూవీకి పోటీగా మరే పెద్ద సినిమా లేదు అంటూ దిల్ రాజ్ చెపుతున్న కారణాలను నమ్మి బయ్యర్లు దిల్ రాజ్ మాటల పై నమ్మకం ఉంచలేక పోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘వకీల్ సాబ్’ మూవీకి సంబంధించిన మాతృక అయిన ‘పింక్’ కథలో పెద్దగా కమర్షియల్ అంశాలు ఉండవు. కేవలం ఒక సామాజిక చైతన్యంతో తీసిన ఈ మూవీ బాలీవుడ్ లో కూడ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ హిట్ కాదు. 

 

అదేవిధంగా ఈ మూవీని తమిళంలో అజిత్ తో తీసినా అక్కడ కూడ సూపర్ హిట్ కాలేదు. దీనితో ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు హిందీ తమిళ భాషలలో చూసిన ఈ సినిమా కథను ఎన్ని మార్పులు చేసి కమర్షియల్ అంశాలు జోడించినా ప్రేక్షకులు ఎంత వరకు చూస్తారు అన్న సందేహాలు చాలామంది బయ్యర్లకు వస్తున్న పరిస్థితులలో దిల్ రాజ్ చెపుతున్న రేట్లు విని మౌనం వహిస్తున్నట్లు టాక్. పవన్ కి తిరిగి స్వాగతం చెబుతూ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ కి ట్విట్టర్ రికార్డులు వచ్చినా ఆ రికార్డులు అన్నీ సినిమా కలక్షన్స్ గా మారతాయా అన్న సందేహాలు కూడ బయ్యర్లకు కలుగుతున్నట్లు తెలుస్తోంది. 

 

సోషల్ మీడియాలో నిరంతరం హడావిడి చేసే పవన్ ఫ్యాన్స్ పవన్ సినిమాకి బ్యాడ్ టాక్ వస్తే అభిమానులు కూడ ధియేటర్ల వంక చూడరు. పవన్ ను రాజకీయాలలోకి రమ్మంటూ హడావిడి చేసిన అభిమానుల కుటుంబ సభ్యులు అంతా పవన్ కు ఓటు వేసినా మొన్నటి ఎన్నికలలో పవన్ ఓడిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనితో ట్విటర్ రికార్డులను చూసి ఆశపడి ‘వకీల్ సాబ్’ ను భారీ రేట్లకు కొనుక్కుని నష్టపోయేకన్నా దూరంగా ఉండటం మంచిది అన్న ఆలోచన దిల్ రాజ్ కు షాక్ ఇస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: