బాలీవుడ్ లో రణబీర్ కపూర్, దీపిక పదుకొనే జోడీ గురించి అందరికి తెలిసిందే. ఈ జోడి స్క్రీన్ పై కనపడితే చాలు అభిమానులు ఊగిపోతారు. ముఖ్యంగా యూత్ లో వీరి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ జోడీ చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ జోడి రోమాన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుంది అనే చెప్పాలి. ఇక వీళ్ళు అప్పట్లో ప్రేమలో ఉండటం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. వీరి జోడి హిట్ అవ్వడానికి వీరి ప్రేమ కూడా ఒకరకంగా హైలెట్ అవుతుంది. 

 

రోమాన్స్ విషయంలో వీరిని చూసి చాలా పాఠాలు నేర్చుకున్నారు బాలీవుడ్ జనం. వీరి సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యాయి అనే చెప్పవచ్చు. లిప్ లాక్ సన్నివేశాలలో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించారు ఈ ఇద్దరు. ఇక దర్శకులు కూడా వీరి విషయంలో కాస్త చూసి చూడనట్టు పోతారని, వారి కాంబినేషన్ హిట్ కావడంతో వాళ్ళ రోమాన్స్ కి అడ్డం చెప్పే వారు కాదని అనే వాళ్ళు. ఇక నిర్మాతలు కూడా ఈ జోడి విషయంలో కాస్త ఎక్కువ ఆసక్తి చూపించే వారు. 

 

యే జవాని హై దివానీ అనే సినిమాలో ఈ జోడి పెట్టుకున్న లిప్ లాక్ అప్పట్లో హైలెట్ అయింది. ముఖ్యంగా ఆ లిప్ లాక్ యూత్ ని ఒక రేంజ్ లో ఊపేసింది అనే చెప్పుకోవాలి. ఆ విధంగా యూత్ ని ఊపెసారు. యుట్యూబ్ లో కూడా ఈ లిప్ లాక్ సీన్ భారీ వ్యూస్ ఆధించింది కూడా. కాగా రణబీర్ ప్రస్తుతం అలియా బట్ తో ప్రేమలో ఉండగా, దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: