"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా కోసం సంవత్సరంన్నర వెయిట్ చేశాడు. ఆ టైమ్ లో అల్లు అర్జున్ ఎన్నో కథల్ని విన్నాడు. ఎంతో మంది దర్శకులు తమ కథలని వినిపించారు. అలా వినిపించిన వారిలో వీఐ ఆనంద్ కూడా ఒకరు. వీఐ ఆనంద్ అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీ సు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

 

అదే సమయంలో వీఐ ఆనంద్ అల్లు అర్జున్ కి కథ వినిపించాడట. కానీ బన్నీసినిమా చేయడానికి సుముఖత చూపలేదట. అయితే బనీ చేయనని చెప్పిన ఆ కథ చివరికి రవితేజ వద్దకి వెళ్ళింది. రవితేజ ఆ కథని ఓకే చేసి "డిస్కోరాజా" సినిమా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ ఉన్న రవితేజ మార్కెట్ ఈ సినిమాతో అమాంతంగా పడిపోయింది.

 


డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్ర కథనం సరిగ్గా లేనందున ప్రేక్షకులకి బోర్ కొట్టేసింది. కనీసం వారం రోజులు కూడా గడవక ముందే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రవితేజకి డిస్కోరాజా మరో పెద్ద డిజాస్టర్ గా నిలిచి ఆయన మార్కెట్ ని పూర్తిగా దెబ్బతీసింది. ఇలాంటి సినిమా అల్లు అర్జున్ చేయకపోవడమే మంచిదైంది.

 

ఈ కథని కాదని త్రివిక్రమ్ తో చేసిన అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసింది. ఇటీవల ఈ చిత్రం యాభై రోజుల పండగని కూడా చేసుకుంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో ఎర్రచందనం స్మగింక్ నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: