ఒక టైమ్ మిషన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోకి వెళ్ళిపోగలుగుతాడు. అయితే ఇప్పుడు టాప్ హీరోల సినిమాల పుణ్యమా అని రానున్న రోజులలో ధియేటర్లు అన్నీ టైమ్ మిషన్స్ గా మారిపోయి ప్రేక్షకులకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసి వచ్చేలా చేస్తాయా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ 1920 కాలంనాటి స్వాతంత్రోద్యమ పరిస్థితుల్లోకి ఆ సినిమాను చూసే ప్రేక్షకులను తీసుకువెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రభాస్ జిల్ రాథా కృష్ణమూవీ 1970 కాలంలోకి తీసుకు వెళ్ళిపోతుంది. ప్రస్తుతం రానా సాయి పల్లవి లు నటిస్తున్న ‘విరాటపర్వం’ 1980 దశకంలో కథ నడుస్తుంది. 


ఈ సంవత్సరం విడుదల కాబోతున్న మరొక భారీ సినిమా ‘కేజీ ఎఫ్ చాప్టర్ 2’ 1970 కాలంనాటి బంగారు గనుల పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రను రవీనా టాండన్ పోషిస్తోంది. అదేవిధంగా ఈ వారం విడుదల కాబోతున్న ‘1978 పలాస’ మూవీ కూడ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకు వెళ్ళిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ ల కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూవీ కూడ గత శతాబ్దపు పరిస్థితులను మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. 


ఇలా ప్రస్తుతం టాప్ హీరోలు నటిస్తున్న భారీ సినిమాలు అన్నీ గత కాలపు పరిస్థితులను నేటితరం ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వారందరినీ ధియేటర్లలోకి రాగానే ధియేటర్స్ ను టైమ్ మిషన్స్ గా మార్చి ప్రస్తుతతరం ప్రేక్షకులకు ఏమాత్రం అవగాహన లేని అలనాటి కథలను పరిస్థితులను చూపెడుతూ ప్రేక్షకులను సమ్మోహన పరచాబోతున్నాయి. దీనితో కాలం మనలను ముందుకు తీసుకువెళుతూ ఉంటే టాప్ హీరోల సినిమాలు మాత్రం టైమ్ మిషన్ లో కూర్చోపెట్టి వర్తమానం నుంచి భూతకాలంలోకి తీసుకువెళుతూ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని  కలిగించ బోతున్నాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: