బన్నీ ఇపుడు సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఆయన  ఫెస్టివల్ మూవీ అల వైకుంఠపురం బంపర్ హిట్ తరువాత లేట్ చేయకుండా సుకుమార్ డైరెక్షన్లో కొత్త మూవీని పట్టాలెక్కించేశాడు. ఆ మూవీ కోసం బన్నీ పూర్తిగా మారిపోతున్నాడు. తమిళనాడు బోర్డర్ లో ఎర్ర కలప స్మగ్లర్ల కధతో  ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది.

 

అంటే బన్నీ పక్కా మాస్ గా ఇంకా  చెప్పాలంటే పూర్తి  నాటుగా కనిపిస్తారన్నమాట. లారీ డ్రైవర్ క్యారక్టర్లో బన్నీ కొత్త పాత్రలో ఇమిడిపోతారని కూడా తెలుస్తోంది. అరవ తెలుగు యాస కలుపుతూ మాట్లాడే అక్రమ కలపను తరలించే లారీ డ్రైవర్ గా బన్నీ పాత్రను సుకుమార్ డిజైన్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ మూవీకి శేషావతారం అన్న టైటిల్ కూడా అనుకుంటున్నట్లుగా భోగట్టా. శేషావతారం అంటేనే పక్కా మాస్ మసాలా టైటిల్. ఈ మూవీ బన్నీకి, సుకుమార్ కి మరో రంగస్థలం లాంటిది అవుతుందని అంటున్నారు. అంటే రామ్ చరణ్ చిట్టిబాబు లా ఎప్పటికీ మరచిపోలేని క్యారక్టర్ బన్నీకి పడుతోందన్న మాట.

 

ఈ మూవీలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్న సంగతి తెలిసిందే. రష్మిక ఇప్పటిదాకా క్లాస్ రోల్స్ చేసింది. మాస్ టచ్ ఇచ్చినా  మరీ ఇలా పక్కా నాటు మాస్ రోల్స్ మాత్రం వేయలేదు. ఇపుడు ఆ సరదాను సుకుమార్ తీరుస్తున్నాడుట.  బన్నీకి జోడీగా శేషమణి పాత్రలో రష్మిక పచ్చి నాటు సరుకుగా కనిపిస్తుందని అంటున్నారు.

 

అంటే రంగస్థలంలో  రామలక్ష్మి పాత్ర ఎలాగో ఇపుడు రష్మిక పాత్ర కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. రష్మిక ఈ పాత్ర కోసం పూర్తిగా చేంజ్ అవుతుందని అంటున్నారు.  మట్టికి దుమ్ముకొట్టుకుపోయే కూలీగా ఆమె ఇందులో కనిపిస్తుందని యూనిట్ వర్గాల సమాచారం..

 

అదే జరిగితే రష్మికలో మరో కొత్త కోణం బయటపడినట్లే. దాన్ని వెలికి తీసి సమంతకు పేరు తెచ్చినట్లే రష్మీకు ఒక మెమొరబుల్ గిఫ్ట్ సుక్కూ  ఇస్తాడని అంటున్నారు. చూడాలి ఎపుడు మరి శేషమణిగా రష్మిక పరకాయ ప్రవేశం చేస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: