సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకున్న చెన్నై చిన్నది సమంత. తెలుగులో తన తొలి సినిమా హీరో అక్కినేని వంశాంకురం అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి పెళ్ళయ్యే వరకు సమంత మరో హీరోతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చిన చివరకు ముందు నుంచి ఉన్న అందరి అంచనాలు నిజం చేస్తూ ఆమె నాగచైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా సమంత వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. పెళ్లైనా కూడా ఆమె హ‌వా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సమంత నటించిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సమంత నాగచైతన్య తో చేసిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఆమె సోలో గా చేసిన ఓ బేబీ సినిమా కూడా హిట్ అయింది. ఇలా పెళ్లయ్యాక కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్న సమంత రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ కి ఇచ్చిన లిప్ కిస్ తో ఒక్కసారిగా సంచలనం రేపింది.

 

టాలీవుడ్ లో ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన సమంత. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటించడం ఒక సంచలనం అయితే మెగా ఫ్యామిలీ హీరోతో ఘాటుగా లిప్ కిస్ ఇవ్వటం నానా ర‌చ్చ ర‌చ్చ‌కు దారి తీసింది. ఈ సినిమాలో సమంత ఇచ్చిన లిప్‌కిస్‌ ఎంత సూపర్ హిట్ అయిందో సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిం. అయితే ఈ లిప్ కిస్ విషయంలో నాగచైతన్య కాస్త హ‌ర్ట్ అయినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. పెళ్లయ్యాక కూడా సమంత హాట్ హాట్ డ్రెస్సులు తో పాటు సెక్సీ లుక్స్ తో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఎన్నో ఫంక్షన్లకు ఆమె కురచ దుస్తులు వేసుకుని రావడం చూస్తూనే ఉన్నాము. అలాంటి టైంలో ఆమె సినిమాల్లో నటిస్తూ లిప్ లాక్ లు ఇవ్వటం పెద్ద షాకింగ్ న్యూస్ కాదని అనుకోవాలి. చాలా మంది టాలీవుడ్‌లో వివాహం త‌ర్వాత ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉంటారు. అందులోనూ అక్కినేని ఫ్యామిలీలో కాస్త రూల్స్ ఎక్కువే అని వినికిడి. కాని స‌మంత మాత్రం ట్రెండ్ మార్చింది. త‌ను ఎప్పుడూ ఎలా ఉండేదో అలానే ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: