టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఆ సీన్లు ఎలా పెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో హీరోయిన్లు పాటల్లో కానీ  ముద్దు పెట్టుకుంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు రచ్చ అంతా ఇంతా కాదు. ఇక స్టార్ హీరోలకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్ ముద్దు పెడుతుంటే వేసేయ్ కుర్చీలోంచి లేచి చేసే రచ్చ అలా ఇలా ఉండదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా లో హీరోయిన్ పూజా హెగ్డే తో అల్లుఅర్జున్ అదిరిపోయే రేంజ్ లో రొమాన్స్ పండించాడు. విజయవాడలో క్యాటరింగ్ పనిచేసే పాత్రలో నటించిన అల్లు అర్జున్ ఓ సన్నివేశంలో పూజా హెగ్డే తో ముద్దు పెట్టించుకుంటాడు. ఆ ముద్దుతో అప్పటివరకు సద్బ్రాహ్మణ్యుడు అన్యం పుణ్యం తెలియని అమాయకుడిగా ఉన్న బన్నీ శరీరంలో ఒక్కసారిగా వెయ్యివోల్టుల కరంట్ షాక్ తగిలినట్లు ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పూజా హెగ్డే బికినీ లో చేసిన రచ్చ కూడా అదిరిపోయింది.

 

బన్నీ పూజా హెగ్డే మధ్య పలు సీన్లలో కెమిస్ట్రీ అద్భుతంగా పండించడంలో దర్శకుడు హరీష్ శంకర్ హిట్ అయ్యాడు. బన్నీహీరోయిన్ పక్కన నటించిన ఆ హీరోయిన్ ను ఆటపట్టించడం లో తనదైన స్టైల్ ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా హెగ్డే బన్నీ కెమిస్ట్రీ మాత్రం బాగా పండిందని చెప్పాలి. టోటల్ సినిమాలు పూజ బికినీ సీన్ తో పాటు బన్నీకి ముద్దు సీన్ హైలెట్ గా నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో బ‌న్నీ ని పూజా రెండు మూడు సీన్ల‌లో ముద్దు పెట్టుకుంట‌ది. ఒక‌టి డైరెక్ట్‌గా అంద‌రూ ఉండ‌గానే ప‌బ్లిక్‌లో ముద్దు పెట్టుకుంటది. క్యాట‌రింగ్ ప‌నిచేసే బ‌న్నీని ఈ కాఫీ ఎవ‌రు చేశారు... ఎవ‌రు చేశారు... అంటూ ఆట‌ప‌ట్టిస్తూ నేనే అని అల్లు అర్జున్ చెప్ప‌గా అంద‌రి ముందు వెళ్లి బ‌న్నీకి ముద్దు పెట్టేస్త‌ది. దాంతో అక్క‌డే ఉన్న ర‌జిత క‌ళ్ళు తిరిగి ప‌డిపోతుంది. ఈ సీన్ సినిమా మొత్తంలో మంచి హైలెట్‌గా నిలుస్తుంది. అలా రెండు మూడు స‌న్నివేశాల్లో ముద్దు పెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: