ప్రస్తుతం టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. ఇక అటు హీరో హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లలో నటించేందుకు ఎక్కడ అభ్యంతరం కూడా చెప్పడం లేదు. ఎందుకంటే పాత్ర డిమాండ్ చేసినప్పుడు లిప్ లాక్ సీన్లు చేయక తప్పదు. అందుకే అటు హీరోయిన్లు కూడా లిప్లాక్ సీన్లు చేసేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్లు కనిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికే లిప్ లాక్ సీన్లకు మాత్రం ఇక్కడ ఓ హాట్ హీరోయిన్ దూరంగానే ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎంతగానో అందాల ఆరబోత చేసింది కానీ... లిప్ లాక్ మాత్రం చేయలేదు. 

 

 

 అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సీనియర్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు జూనియర్ హీరోల సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ నేను చెబుతుంది హీరోయిన్ గురించి అనుకుంటున్నారా.. ఓవైపు తెలుగుతో పాటు మరోవైపు తమిళ కన్నడ సినిమాల్లో కూడా సత్తా చాటుతూ తన అందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని.. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా. టాలీవుడ్లో ఈ అమ్మడు ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది. సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోల సరసన కూడా తన నటనతో డాన్స్ లతో అదరగొట్టింది. 

 

 

 ప్రస్తుతం ఈ అమ్మడు ఏ సినిమాలో నటించిన డాన్సులతో ఇరగదీస్తున్నది  అనే చెప్పాలి. ఇక అందాల ఆరబోతలో కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు ఈ అమ్మడు. కానీ ఒక్క లిప్ లాక్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను అంటుంది తమన్నా. ఈ విషయం స్వయంగా తమన్నా ఇంటర్వ్యూలో తెలిపింది. పాత్రకు తగ్గట్టుగా అందాల ఆరబోత చేయడానికి తాను ఎలాంటి రిస్ట్రిక్షన్స్  పెట్టుకోను అని తెలిపిన తమన్నా లిప్ లాక్ సీన్లు  మాత్రం చేయను అంటూ చెప్పేసింది. ఈ విషయాన్ని ముందుగానే దర్శకులు కూడా చెబుతానని అంటోంది తమన్నా. సినిమా అవకాశాలు వచ్చినా రాకున్నా లిప్ లాక్ సీన్లలో మాత్రం నటించను అని అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: