బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ సీన్స్ చాలా కామన్. కథ ఏదైాన ఇంటిమేట్ సీన్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. దాదాపు బాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా బోల్డ్ సీన్స్‌లో నటించిన వారే. ఇప్పటికే కాదు గత మూడు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్లో సంచలనం సృష్టించిన రొమాంటిక్ సీన్స్ చాలా నే ఉన్నాయి. అయితే ఇలాంటి సీన్స్‌కు నో చెప్పిన బాలీవుడ్ స్టార్స్ కూడా చాలా మందే ఉన్నారు.
ఈ లిస్ట్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సిన హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెర మీద రొమాన్స్ పండించటంలో ఎక్స్పర్ట్. తెర మీదే కాదు తెర వెనుక కూడా ఘాటు లవ్ స్టోరీస్ నడిపించిన సల్మాన్, తెర మీద ఇంటిమేట్ సీన్స్ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెర మీద లిప్‌లాక్‌లకు ఓకే చెప్పడు సల్మాన్. అందుకు కారణం కూడా వెళ్లడించాడు సల్లూ బాయ్. తన తల్లి సల్మా తన సినిమాలు చూస్తుందని. తాను అలాంటి ఇబ్బందికర సన్నివేశాల్లో నటించటం ఆమెకు ఇష్టం లేదని చెప్పాడు సల్మాన్.
మరో బాలీవుడ్ టాప్ స్టార్ షారూఖ్ కూడా ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగానే ఉంటున్నాడు. తనకు తానే లిఫ్ లాక్ సీన్స్ చేయకూడాదని ఓ నియమం పెట్టుకున్నాడు సల్మాన్. అయితే జబ్ తక్ హై జాన్ సినిమా విషయంలో మాత్రం తన నియమాన్ని పక్కన పెట్టి కత్రినా కైఫ్‌తో లిప్ లాక్ చేశాడు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందని యష్ చోప్రా రిక్వెస్ట్ చేయటంతో తప్పక ఆ సీన్లో నటించానని చెప్పాడు షారూఖ్. స్టార్ వారసులిగా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఇంటిమేట్ సీన్స్‌కు నో చెపుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ రోల్స్‌కు నో చెప్పిన సోనాక్షి తరువాత స్కిన్ షోకు ఓకె చెప్పినా బోల్డ్ సీన్స్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెపుతోంది.