బాలీవుడ్ జనాలు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. టాప్ హీరో సినిమా అంటే చాలు అందులో ఉండే సన్నివేశాల గురించి ఎన్నో అంచనాలు వేస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాల్లో ఉండే లిప్ లాక్ సన్నివేశాలకు మంచి డిమాండ్ ఉంటుంది అనే మాట నిజం. ముఖ్యంగా అగ్ర హీరోలు హ్రితిక్ రోషన్, అమీర్ ఖాన్, షాహిద్ కపూర్.. ఈ ముగ్గురు లిప్ లాక్ సీన్స్ లో బాగా ఫేమస్ అయ్యారు. చాలా మంది హీరోయిన్స్ కి ఈ ముగ్గురు లిప్ లాక్స్ ఇచ్చారు. సీనియర్ హీరోలు అయినా సరే వీళ్ళకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. 

 

హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్, పూజ హెగ్డే, కత్రినా కైఫ్ ఇలా చాలా మందికి లిప్ లాక్ ఇచ్చాడు, ప్రధానంగా ధూమ్ 2 లో అతను ఇచ్చిన లిప్ లాక్ హైలెట్ అనే చెప్పుకోవచ్చు. ఇక జిందగీ నా మిలేగి దుబారా సినిమాలో అతను కత్రీనా కి ఇచ్చిన లిప్ లాక్ గురించి టాలీవుడ్ చాలా రోజులు మాట్లాడుకుంది. ఆ తర్వాత ఆ లిప్ లాక్ సీన్ పై సల్మాన్ ఖాన్ ఫైర్ అయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే బాబు చాలా మందికి లిప్ లాక్స్ ఇచ్చాడు. దాదాపు అతను చేసిన అందరి హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు చేసాడు. 

 

ముఖ్యంగా కరీనా కపూర్ కి అతను 3 ఇడియట్స్ సినిమాలో ఇచ్చిన లిప్ లాక్ హైలెట్ గా నిలిచింది. రాజా హిందుస్తానీ సినిమాలో కరీనా కపూర్ అక్క కరిష్మా కపూర్ కి లిప్ లాక్ ఇచ్చాడు. ఇక షాహీద్ కపూర్ కూడా సీనియర్ హీరోయిన్ల నుంచి నేటి కుర్ర హీరోయిన్ కైరా అద్వాని వరకు లిప్ లాక్ ఇచ్చాడు. ఇవి అన్నీ బాలీవుడ్ లో ఫేమస్.

మరింత సమాచారం తెలుసుకోండి: