టాలీవుడ్ సిని పరిశ్రమలో వచ్చిన మార్పులు చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఓ పక్క సినిమాల కంటెంట్ పరంగా స్ట్రాంగ్ అవుతూ కొత్త కొత్త క్రియేటివిటీ బయటకు వస్తుంటే మరోపక్క లిప్ లాకులు, హాట్ సీన్స్ తో రెచ్చిపోతున్నారు. చిన్న సినిమాలకు ఇవే సూపర్ హిట్ ఫార్ములా అయ్యిందని చెప్పొచ్చు. పాత సినిమాల్లో హీరో హీరోయిన్ డ్యూయెట్స్ ఉంటాయి.. వాటిలోనే వాళ్ల రొమాన్స్ ఉంటుంది. అయితే అది శృతిమించకుండా ఉంటుంది. 

 

ఒకప్పుడు పాటల్లో హీరో హీరోయిన్ ను ముద్దు పెట్టాడంటే ఓ పువ్వుని చూపించి ఆ పువ్వు వెనుకకు వెళ్లి ముద్దు పెట్టినట్టు చూపించే వారు. పువ్వు చాటున హీరో, హీరోయిన్ వెళ్లడం ఆ పువ్వు ఊగడం లాంటివన్నమాట. అయితే రాను రాను సినిమా కలర్చ మారింది. మన దగ్గర వెస్ట్రెన్ సినిమాల ప్రభావం బాగా చూపించింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తే అవసరం ఉన్నా లేకున్నా సరే మూతి ముద్దులు ఉండాల్సిందే. పువ్వు చాటు ముద్దులు కాదు ఏకంగా రెచ్చిపోయి మరి మూతి ముద్దులతో హంగామా చేస్తున్నారు.  

   

హీరో, హీరోయిన్స్ కూడా ఈ విషయంలో ఓ క్లారిటీతో ఉన్నారని తెలుస్తుంది. హీరోయిన్స్ కూడా సినిమా ఒప్పుకునే ముందే లిప్ లాక్స్ గురించి అడగడం వాటికి ఓకే అనుకుంటేనే సినిమా సైన్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఒకవేల అక్కడ లిప్ లాక్ అవసరం లేకపోయినా డైరక్టర్ కావాలని ఇరికించారని అనిపిస్తే సినిమా నుండి క్విట్ అవుతున్నారు. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమలో కథలో మార్పులే కాదు రొమాన్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అయితే ఈ జెనరేషన్ ను బట్టి ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో సినిమాలు చూడాలంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ భయపడే పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: