బాలీవుడ్‌లో ముద్దుల సీన్‌లకు యమ ఫేమస్ హీరో ఎవ‌రంటే మ‌న‌కు ముందు టక్కున గుర్తుకు వచ్చే పేరు ఇమ్రాన్ హష్మీ. ఈయ‌న సినిమాల్లో లిప్‌లాక్స్ లేకుండా సినిమాలే ఉండ‌వు. ఈ స్టార్ హీరో ఏహీరోయిన్‌తో రొమాన్స్ న‌డిపినా అది ఖ‌చ్చితంగా లిప్‌లాక్ ఉండాల్సిందే. అంతేకాదండోయ్ రొమాంటిక్ సీన్స్ కూడా కొంచం పీక్స్‌లోనే ఉంటాయ‌ని చెప్పాలి. ఇక ఈ హీరో న‌టించిన చిత్రాల‌న్నీ కూడా దాదాపుగా బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల‌నే ఎక్కువ‌గా ఎన్నుకుంటాడు. అక్‌స‌ర్‌, ర‌ష్‌, జ‌వానీదివానీ ఈ చిత్రాల‌న్నీ కూడా అలాంటివే. ఇక అక్‌స‌ర్‌లో ఇమ్రాన్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ మాత్రం మాములుగా లేదు. ఒక రేంజ్ ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపుఊపేసింది. అంత రొమాంటిక్ సీన్స్ చేస్తాడు ఇమ్రాన్‌. చాలా వ‌ర‌కు త‌న సినిమాలు చూసే మన టాలీవుడ్ ద‌ర్శ‌కులు తెలుగులో కూడా అర్జున్‌రెడ్డి, ఆర్ ఎక్స్‌100,ఆర్‌డిఎక్స్ లాంటి సినిమాల‌ను చేయ‌డానికి సాహ‌సిస్తున్నార‌నే చెప్పాలి. టాలీవుడ్ చాలా వ‌ర‌కు బాలీవుడ్ బోల్డ్ కంటెంట్ సినిమాల‌ను చూసే ఇక్క‌డ అలాంటి సినిమాల‌కు కాస్త డిమాండ్ పెరిగింద‌ని చెప్పాలి. 

 

ఇక ఇటీవ‌లె ఇమ్రాన్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ... త‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లు తెలిపాడు.  అంతేకాదు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా దాన్ని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.పైగా ఆ మహిళకు అదివరకే పెళ్ళై పోయిందని తనకు అంతకు ముందు తెలియదన్నాడు. ఈ సంఘటన తాను నటించిన 'మర్డర్' సినిమాలో ఉన్నటువంటి సీనే తన జీవితంలో జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నాడు ఇమ్రాన్. మ‌ర్డ‌ర్ సినిమాలో కూడా సేమ్ అలానే జ‌రుగుతుంది. ఆ సినిమా ఫుల్ హిట్ అయింది. 

 

సినిమాలో లానే అనుకోకుండా ఓ రోజు ఆమె భర్త మమ్మల్ని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడం జరిగిందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. అలా దొరికిన సమయంలో తన తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నానని అన్నాడు. అంతేకాక ఆ సమయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ ప్లేస్‌లో నేనే ఉంటే ఇంకేదో చేసేవాడినన్నారు. తాను చేసిన నీచపు పని లాగే.. తన భార్యతో ఎవరైనా ఎఫైర్ పెట్టుకుంటే సహించేవాడిని కాదని ఇమ్రాన్ అన్నాడు. అంటే దీన్ని బ‌ట్టి ఈ రొమాంటిక్ హీరో సినిమాల‌కే కాకుండా బ‌య‌ట కూడా రొమాంటిక్ హీరోనే అన్న‌మాట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: