చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్లంతా సినిమాను వెరైటీగా తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హద్దుల్ని సైతం చెరిపేస్తుంటారు. ఇన్నాళ్లు బాలీవుడ్‌, హాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన రొమాంటిక్‌ సీన్లు ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా కామ‌నైపోయాయి. అయితే కేవ‌లం ఇటీవ‌ల వ‌స్తున్న సినిమాలే కాదు.. 1980లో వ‌చ్చిన సినిమాల్లోనూ కొన్ని రొమాంటిక్ సిన్లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అందులో సాగర సంగమం చిత్రంలోని `మౌనమేలనోయి ఈ మరపురాని రేయి` పాట గురించి ఎంత చెప్పినా తక్కువే కదా.

 

సినిమా జూన్ 3, 1983 లో విడుదలైన ఒక అందమైన తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన శంకరాభరణం చిత్రం విజయనంతమైన నేపథ్యంలో సంగీత, నృత్య కథాత్మక చిత్రాలకు ఆదరణ తెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోకమల్ హాసన్ మరియు జయప్రద జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శరత్ బాబు మరియు ప్రముఖ గాయని శైలజ నటించారు. స్వరకల్పన ఇళయరాజా. నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. 

 

ఇది తమిళంలో `సాలంగై ఓలి` అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది. ఈ సినిమా కోసం వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు ఎప్పటికీ నిలిచిపోయే ఆణిముత్యాలు. విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఇక ఈ సినిమాలో `మౌనమేలనోయి ఈ మరపురాని రేయి` పాట విన్న‌ప్పుడ‌ల్లా.. జయప్రద రొమాంటిక్ లుక్స్‌,  ఆ గోరు వెచ్చటి నీటి అనుభూతి, ఆ చల్లని సముద్రపు గాలి హాయి, ఆ గులాబీ పూవు సువాసన, ఆ సాంబ్రాణి పొగ అలౌకిక ఆఘ్రాణం పొందుతారు అన‌డంలో ఏ మాత్రం సందేహం. ఎందుకంటే.. క్లాసిక్ మూవీ అయిన‌ప్ప‌టికీ.. ఈ పాట‌ను ఎంతో రొమాంటిక్‌గా తెర‌కెక్కించారు కె.విశ్వనాథ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: