టైటానిక్ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నాత‌క్కువే. ఈ చిత్రం అప్ప‌ట్లో అంత పెద్ద సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. టైటానిక్ అనే పేరున్న ఓ పెద్ద ఓడకు సంబంధించిన కథ. ఇంగ్లాండ్ లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు తన మొదటి యాత్రపై బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ భారీ మంచు శకలంతో ఢీకొని మునిగిపోతుంది. టైటానిక్ షిప్‌కు మరియు టైటానిక్ చిత్రానికి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే తెర వెనుక మనకు తెలియాల్సిన విషయాలు మరియు తెర ముందు మనం చూసిన విషయాల మధ్య గల తేడాలు, మరియు వాటి నిజాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 

ఈ చిత్రంలో రోస్ బొమ్మను గీసింది స్వయంగా డైరెక్టర్ జేమ్స్ కేమెరూన్ అని, మై హార్ట్ విల్ గో ఆన్ సాంగ్‌ని తాను అసలు విన‌న‌ని బయటపెట్టింది. టైటానిక్ క్లైమాక్స్ సీన్‌ని.. టీవీ షో వ్యాఖ్యాత కోల్బర్ట్‌తో కలిసి కేట్‌లు రియల్‌గా న‌టించి చూపించడం గమనార్హం. ఇక టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికులను సృష్టించాడు. అందులో హీరో జాక్ మరియు హీరోయిన్ రోజ్ వీరు టైటానిక్ చిత్రంలో నిజమైన ప్రేమికులు. కాని మనకు తెలిసినంత వరకు ఈ షిప్ ఎలాంటి ప్రేమ కథలు లేవు. కాని అర్థాంతరంగా అసులు బాసిన ఆ పడవలో ఎంత మంది ప్రేమికులు ఉన్నారో ఎవరికి తెలుసు.

 

ఇన్‌స్పైరింగ్‌గా టైటానిక్ హీరో హ‌రోయిన్ లిప్‌లాక్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అయితే హాలీవుడ్ చిత్రాలు సాధార‌ణంగా సౌత్‌లో హిట్ అవ్వ‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ ఈ చిత్రానికి వ‌చ్చిన క్రేజ్ మాత్రం అప్ప‌ట్లో అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ఇన్‌స్పైర్ చేసిందంటే ఇప్ప‌టి ద‌ర్శ‌కులు ఈచిత్రంలోని కొన్ని స‌న్నివేశాల‌ను ఇప్ప‌టికి కొన్ని చిత్రాల్లో వాడుతున్నారు. అంత‌లాగా కొన్నీ సీన్ల‌ను డిజైన్ చేశాడు. ప‌డ‌వ అంచులో నిలుచుని ఇద్ద‌రూ చేతులు బారుగా చాచి ముద్దు పెట్టుకునే సీన్ చాలా హూలెట్ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: