బుల్లితెర మీద అడల్ట్ జోక్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షో నటులు వ్యభిచార గృహంలో మహిళలతో పోలీసులకు పట్టుబడ్డారు.. విశాఖపట్నంలో ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుంది అన్న పక్కా సమాచారం పోలీసులకు తెలియడంతో.. ఆ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడి చేయగా జబర్దస్త్ కామెడీ షోకి చెందిన ఇద్దరు నటులు ఆ దాడిలో మహిళలతో పట్టుబడ్డారు.
దీంతో ఆ నటులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. విశాఖపట్నంలో మాధవధారలో ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహింస్తున్న వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో ఒక మహిళతో నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. ఆ విటులు ఇద్దరు కూడా దొరబాబు, పరదేశిగా వీరిరువురూ జబర్దస్త్ కామెడీ షో నటులుగా మంచి గుర్తింపు పొందినవారిగా గుర్తించారు.
అయితే ఈ దాడి నిన్న రాత్రి జరిగింది.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పక్క సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లారు.. గత కొంతకాలంగా మాధవధారలో ఉన్న ఆ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుంది అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
కదా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా విశాఖనగరం గత కొద్దీ కాలంగా వ్యభిచార దందాలు పెరిగిపోయాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడిక్కడ వ్యభిచార గృహాలపై దాడులు జరుపుతున్నారు.. కొందరు ఈ వ్యభిచార గృహాలు ఆఫీస్ లో నిర్వహించగా మరికొందరు అపార్ట్మెంట్లను అడ్డాగా మర్చి ఈ దందాలను కొండసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు జరిగిన ఈ దాడులో జబర్దస్త్ నటులు దొరికిపోవడంతో ఈ కేసు సంచలనంగా మారింది..
నగరంలో గత కొద్దిరోజులుగా వ్యభిచార దందాలు పెరిగిపోయాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు ఆట కట్టిస్తున్నారు. అయినా సరే అపార్ట్మెంట్లను అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. కానీ ఈసారి జబర్దస్త్ నటులు దొరికిపోవడం సంచలనంగా మారింది.