ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పేరు చెబితేనే భయంతో కంపించిపోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం అంటున్నారు డాక్టర్లు.  చైనాలోని కుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా ఇప్పుడు వివిధ దేశాల్లో ప్రబలిపోతుంది.  తాజాగా ఈ మహమ్మారి ఇప్పుడు భారత్ పై పడింది. హైదారబాద్ నగరంలో కరోనా బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  బయటి ప్రదేశాల నుంచి ఎవరు వచ్చినా వారికి వైద్య పరీక్షలు నిర్వహించాకే పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా గురించి ఇప్పటికే అవగాహన ఏర్పాట్లు చేయిస్తున్నారు.  వైద్యులు అప్రమత్తం అవుతున్నారు.. పోస్టర్స్ రిలీజ్ చేశారు. 

 

తాజాగా ప్రముఖ నటి కస్తూరీ ఇటీవల హైదరాబాద్ కి కొన్ని పనులపై వచ్చారట.   ఇక్కడి నుంచి ఆమె తిరిగి తన స్వస్థలమైన చెన్నై వెళ్లిపోవాల్సి పరిస్థితిలో తనకు భయంగా ఉందని తెలంగాణలో కరోనా పేషెంట్ ఉన్నారా? నేను ఇక హైదరాబాద్‌లోనే చిక్కుకుపోవాల్సిందేనా? ఎందుకంటే నాకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలంటే భయంగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఈ ట్విట్ ఆమె  నిన్న రాత్రి ఆమె ఓ ట్వీట్ చేసారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు గుర్తించిన నేపథ్యంలో తాజాగా మంగళవారం మరో ముగ్గురు వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్య సిబ్బంది వీరిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

 

ఇప్పటి వరకు 9 టెస్టులతో పాటు మంగళవారం వచ్చిన 13 కలిపి మొత్తం 22 మంది రిపోర్ట్స్ వెయిటింగ్‌లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.  ప్రస్తుతం వీరు అన్ని భద్రత ఏర్పాట్ల మద్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఇప్పుడు కరోనా కు సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా వణికి పోతున్నారు.  తాజాగా నటుడు ప్రభాస్ కూడా తన ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు.  కరోనాపై కొంత మంది సెలబ్రెటీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: