రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సినిమా షూటింగ్ చేస్తున్నారు తప్పించి ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి  అప్డేట్స్ ను బయటకు రిలీజ్ చేయడం లేదు.  ఎందుకు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.  మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లీకులు బయటకు వచ్చాయి.  బహుశా అందుకే లీకులకు భయపడి బయటకు రాకుండా చూసుకుంటున్నారు.  


అయితే, గత ఏడాది కాలంగా ఈ సినిమాలోని అప్డేట్స్ కోసం, సినిమా పోస్టర్ కోసం కనీసం సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎంతగా ఎదురు చూస్తున్న కనీసం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇలా చేయడం వలన కలిగే ఉపయోగం ఏంటి అన్నది పక్కన పెడితే, సినిమా విషయంలో రాజమౌళికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోంది.  


రాజమౌళి సినిమాల్లో ఉండే క్యూరియాసిటీని పబ్లిసిటీ విషయంలో కూడా రాజమౌళి చూపిస్తుంటారు.  ఇప్పుడు అలానే చేస్తున్నారు.  ఎందుకంటే సినిమాను ఎంతగా చెప్పకుండా దాచిపెడితే అంత మంచిది అని రాజమౌళి ఆలోచన కావొచ్చు లేదా మరొకటి కావొచ్చు.  కారణం ఏదైనా సరే దాచిపెట్టి ఒక్కసారిగా బయటకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  అయితే, తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.  


ఈనెల 27 వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు.  ఆ రోజున ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  ఆ రోజున రామ్ చరణ్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేస్తారని, ఆ లుక్ తరువాత ఎన్టీఆర్ లుక్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉనన్టుగా కూడా తెలుస్తోంది.  ఫస్ట్ లుక్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు మరో 20 రోజులు ఆగలేరా చెప్పండి.  కానీ, ఆరోజున కూడా రాజమౌళి  ఏదో ఒక సాకుతో రిలీజ్ చేయకుంటే  అభిమానులు  ఎమ్ చేస్తారో వాళ్ళకే తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: