సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పాటు మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన అలవైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కాగా రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక సరిలేరు తరువాత మహేష్ బాబు నటించబోయే తదుపరి సినిమా విషయమై ప్రస్తుతం పలు వార్తలు ప్రచారం అవుతుండగా, ఆయన అతి త్వరలో మెగాస్టార్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారని, రెండు రోజుల క్రితం ఆ సినిమా విషయమై మహేష్ ను కలిసిన కొరటాల ఆయన పాత్రను వివరించడం, అలానే అది మహేష్ కు ఎంతో నచ్చడం జరిగిందని అంటున్నారు. 

 

దాని తరువాత మహేష్ బాబు, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు. అయితే చిరు, కొరటాల సినిమాలో మహేష్ చేయబోయే పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, 1990 సమయంలోని విద్యార్థి సంఘం నాయకుడిగా ఆ సినిమాలో మహేష్ కనపడనున్నట్లు చెప్తున్నారు. మహేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఆయన చేయనున్న పాత్ర మరొక ఎత్తని అంటున్నారు. తప్పకుండా రిలీజ్ తరువాత మెగాస్టార్ తో పాటు సూపర్ స్టార్ కు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు దక్కడం ఖాయం అని అంటున్నారు. అయితే ఆ పాత్ర విషయమై ఇటీవల మహేష్ ని కలిసిన అల్లు అర్జున్, ఆ పాత్రలో తాను నటించాలని భావిస్తున్నట్లు చెప్పారట. 

 

ఎప్పటినుండో మెగాస్టార్ సినిమాలో ఒక చిన్న రోల్ చేయాలని చూస్తున్నానని, అందువలన ఈ అవకాశం కనుక తనకు ఇచ్చినట్లయితే బాగుంటుందని మహేష్ ని బన్నీ కోరగా, అందుకు మహేష్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్. అంతేకాక అల్లు అరవింద్ కూడా ఈ విషయమై మెగాస్టార్ ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసారని అంటున్నారు. అయితే మొత్తంగా ఆ పాత్ర విషయంలో తుది ప్రకటన మరొక వారం రోజుల్లో వెలువడుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగాస్టార్ మూవీలో మహేష్ స్థానంలో బన్నీని చూడొచ్చన్నమాట....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: