టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది.  ఈ మూవీ రిలీజ్ కి ముందే మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. అయితే అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రెండెళ్ల తర్వాత వచ్చిన విషయం తెలిసిందే. నివాస్ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీలో నటించాడు. ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది.  దాంతో కథల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతూ వచ్చారు అల్లు అర్జున్.  వాస్తవానికి డైరెక్టర్స్ కథ చెప్పన విధానం, అతని స్టామినాతో చాలా వరకూ ప్రాజెక్టులు ఓకే అయ్యిపోతూంటాయి. ఇక సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కొన్ని విషయాల్లో చాలా తేడాలు రావడం.. అనుకున్న దానికన్నా వేరే యాంగిల్ లో వెళ్లడంతో ఆ ప్రభావం సినిమాపై పడుతుంది.  

 

మొదటి స్క్రిప్ట్ తో పోల్చుకుంటే.. షూటింగ్ పూర్తయ్యేలోపు పూర్తిగా తేడారావడం సినిమాలు డిజాస్టర్స్ కావడం జరుగుతుంది.  ఇదే విషయాన్ని నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీతో అల్లు అర్జున్ కి బాగా అర్థమైందట.  అందుకే ఈ మూవీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.  అల్లు అర్జున్ తను తీసుకునే నిర్ణయాలు చాలా వరకూ ఆచి,తూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకుంటూంటాడని టాక్. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ నే నమ్ముకొని ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  అయితే అల్లు అర్జున్ ఓ పెద్ద డిజాస్టర్ నుంచి ఎస్కేప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దర్శకుడు విఐ ఆనంద్, అల్లు అర్జున్ కు ఓ స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేసాడట.

 

అయితే స్టోరీ లైన్ విన్న బన్నీ ఇది కమర్షియల్ హిట్ అవుతుందని భావించాడట.. కానీ తర్వాత కథ గురించి ఆలోచించగా.. ఎక్కడో తేడా కొట్టేసిందట. దాంతో ఆ కథను పక్కనబెట్టారట. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. రవితేజ నటించిన ‘డిస్కోరాజా’.  ఇటీవల విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ రిలీజ్ కావడం.. బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం తెలిసిందే. ఇంత పెద్ద లాస్ ప్రాజెక్టు రవితేజ కెరీర్ లో లేదని చెప్తున్నారు. మొత్తానికి బన్నీ తీసుకున్న నిర్ణయంతో డిస్కోరాజా లాంటి భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నట్టయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: