జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో జనసేన రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ నగరంలో మార్చి 15న సీఏఏకు అనుకూలంగా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది.

 

చాలాసార్లు ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ తో అమిత్ షా హైదరాబాదులో భారీ బహిరంగ సభలో బేటీ కాబోతున్న క్రమంలో ఆ కార్యక్రమానికి భారీగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీలో కూడా తమ ఫేవరేట్ హీరో కి నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా కి ఈ భారీ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలియజేయాలని ఫుల్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు డిసైడ్ అయ్యారట. అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు అదేవిధంగా తెలంగాణ బిజెపి నాయకులకు ఎవరూ ఊహించని అమిత్ షా దిమ్మతిరిగే షాక్ ఇవ్వటం జరిగింది.

 

విషయంలోకి వెళితే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు.. ఇంకోవైపు కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి.. ఇలా రెండు కీలకాంశాలు ముందున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు రాలేనని అమిత్‌షా స్థానిక బీజేపీ నేతలకు వర్తమానం పంపారు. దాంతో మొత్తం సభనే రద్దు చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో ఈ సభ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు అమిత్ షా షాక్ ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: