కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియా తో ముచ్చటించారు..

 

"నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పలాస నాకు చాలా స్పెషల్ సినిమా అన్నారు. ఈ సినిమాలో ఒక మైండ్ గేమ్ ఆడే ఒక నెగిటీవ్ రోల్ లో నటించాను. నా పాత్రలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మేకప్ లేకుండా ఈ సినిమాలో నేచురల్ గా నటించాను.  ఈ పాత్ర కోసం జుట్టు పెంచడం  కూడా జరిగింది, ఆ లుక్ విలన్ గా బాగా సెట్ అయ్యింది. 

 

ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ గారి పాత్రకు దగ్గరగా నేను ఈ సినిమాలో ఒక రోల్ చెయ్యడం జరిగింది, కచ్చితంగా డిఫరెంట్ గా ఉండబోతోంది అన్నారు. ఒక నటుడిగా, ఒక సంగీత దర్శకుడిగా నాకు ఈ సినిమా చాలా స్పెషల్. మ్యూజిక్ కోసం చాలా సహజమైన వాయిద్యాలను వాడడం జరిగింది. 

 

సినిమా చాలా సహజంగా ఉంటుంది, పాత్రలు కూడా ఎక్కడా బోర్ కొట్ట‌కుండాఉంటాయి అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా న‌టించారు. స్క్రీన్ ప్లే ఫ్రెష్ గా ఉంటుంది, కావున కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం లేకుండా పోయింది. మొదట సంగీతం చెయ్యమన్నారు, తరవాత ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పాడు, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించడం జరిగింది. ఉత్తరాంధ్ర భాషలో నేను ఈ మూవీలో మాట్లాడడం జరిగింది. మ్యూజిక్ దర్శకుడి గా నటుడి గా పలాస 1978 నా కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుంది. 

 

ఈ సినిమాలో ఐదు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఆల్బమ్ కోసం ఐదుగురు కొత్త సింగర్స్ ను పరిచయం చెయ్యడం జరిగింది. జానపద కళ ఉన్న సినిమా కావున ఫ్రెస్ నెస్ కోసం కొత్తవారిని తీసుకోవడం జరిగింది. భవిషత్తులో మరింతమంది కొత్తవారిని పరిచయం చేస్తాను, ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ సాంగ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: