రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా స్టార్ హీరోయిన్ అయింది. అంతే తొందరగా ఫేడౌట్ అయింది. ఆమె పొడుగు, బిగువు. సొగసు, సోయగం అన్నీ కలిపేసి కొన్నాళ్ళు టాలీవుడ్ ని ఏలేసింది. ఆ టైంలో ఆమె కావాలని బడా  స్టార్లు అంతా క్యూ కట్టారు. సినిమా హిట్ అయితే వారి అకౌంట్లో పడేది. ఒక్కసారి ఫ్లాప్ తగలగానే రకుల్ ని దూరం పెట్టేశారు.

 

మరో వైపు తన అందంతోనే పందెం కాసిన రకుల్ అతి చేసింది. ఉన్నదంతా చూపించేసింది. వంపుసొంపులతో కుర్రాళ్ళ కొంప ముంచాననుకుంది. తీరా చూసుకుంటే తన కొంపే మునిగిందని గ్రహించేసరికి ఆమె స్టార్ డం హారతి కర్పూరంగా కరిగిపోయింది.

 

ఇపుడు చేతిలో సినిమాలు లేవు. దాంతో  తాపీగా గతమెంతో ఘనం అంటూ రకుల్ చింతిస్తోంది. అంతే కాదు తాను చేసిన తప్పులను ఎంచి మరీ ఒకటికి పదిసార్లు  లెక్కించుకుంటోంది. నేను గ్లామర్ ని నమ్ముకున్నాను, ఉన్నది ఉన్నట్లుగా అంతా చూపించేశాను, నటన వైపు చూపు వెళ్ళలేదు. ఇదే నా కెరీర్ ఇలా పడిపోవడానికి నేను చేసిన అతి పెద్ద తప్పు అని వగచి అల్లాడుతోంది.

 

సరే జరిగింది గతం. ఇపుడు భవిష్యత్తు. రకుల్ అన్నీ తెలుసుకుంది. నటన చూపిస్తాను అంటోంది. ఆదరించి అక్కున చేర్చుకునే గుణం చిత్ర సీమకు ఉందా. ఒకసారి కిందపడిపోతే తొక్కుకునిపోతారు తప్ప మళ్ళీ చేయి అందించి మీదకు తీసుకువస్తారా. రకుల్ కెరీర్ అలా ముగియడం ఆమెకే కాదు కొత్తగా వచ్చేవారికి. గ్లామర్ షోతోనే అంతా అని విర్రవీగేవారికి ఒక గుణపాఠం. అంతే.

 

ఏది ఏమైనా రకుల్ లో నటిని చూసేందుకు ఇదే మంచి అవకాశం. మరి దాన్ని అందిపుచ్చుకుని ఎవరైన క్రియేటర్స్ ముందుకువస్తే కొత్త రకుల్ ని తెర మీద చూసుకునే చాన్స్ ఆమెకు, ఆడియన్స్ కి కూడా ఉంటుంది. మరి ఎవరు రెడీ అవుతారో. లేక వదిలేస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: