సినీరంగంలో ఉన్నవారి ఇళ్లలోనూ సినిమా వాతావరణమే ఉంటుంది. అందుకే హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు. ఇతర సినిమా కళాకారుల కుటుంబాల్లో పిల్లలు కూడా సినీరంగంలోనే స్థిరపడుతుంటారు. అలాంటి సినీ కుటుంబమే నటుడు సాయికుమార్ ది.

 

 

సాయి కుమార్ తండ్రి అయ్యప్ప శర్మ సినిమా నటుడన్న సంగతి తెలిసిందే. ఆయన భార్య కూడా సినీరంగానికి చెందినవారే.. అందుకే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగారు. వారికి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఈ విషయాలను సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

 

IHG

 

చిన్నప్పుడు సాయి కుమార్ సోదరులకు సినిమాయే ప్రపంచమట. ఇనుప కుర్చీని కెమెరేగా పట్టుకుని సాయి డైరెక్షన్‌ చేసేవాడట. సాయి కుమార్ అమ్మానాన్న ఎక్కడికైనా బయటకు వెళ్తే, వెంటనే ఇంట్లో షూటింగ్‌ మొదలైపోయేదట. కృష్ణ గారు నటించిన ‘కుమారరాజ’లో ఆయన ట్రిపుల్‌ రోల్‌ చేశారు. దాన్ని తమిళంలో ‘త్రిశూలం’ పేరుతో తీశారు.

 

 

ఇక ఆ కథతో ఇంట్లో షూటింగ్‌ జరిగేదట. చాలా సరదాగా ఉండేదట. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండేవారట. సీనియర్ కృష్ణ పాత్రకు హీరోయిన్ గా రవి శంకర్ శర్మకు ఎవరూ లేరు. అందుకే ఇంట్లో ఉన్న నాయనమ్మే హీరోయిన్ గా నటించేదట. అంటే సాయి కుమార్ డైరెక్షన్ చేస్తుంటే.. హీరోగా రవి శంకర్ శర్మ, హీరోయిన్ గా వాళ్ల బామ్మ నటించేవారట.

 

 

 

అలా సరదాగా ఆ రోజులు గడిచిపోయాయని రవి శంకర్ శర్మ గుర్తు చేసుకున్నారు. ఇక వాళ్ల ఫ్యామిలీ విషయాలకు వస్తే.. 1982 వరకూ వాళ్ల నాన్నగారే కుటుంబం బాధ్యతలు ఎక్కువగా తీసుకునేవారట. కొడుకులు , కూతుళ్లు అందరినీ డిగ్రీ వరకూ చదివించారట. ఇక ‘తరంగణి సినిమా నుంచి సాయి కుమార్ అన్నీ చూసుకునేవారట. చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్లు వాళ్ల నాన్న సంపాదనకు సాయి సంపాదన తోడైందని గుర్తు చేసుకున్నారు రవిశంకర్ శర్మ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: