ప్రపంచ వ్యాప్తంగా తో పాటు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో చాలావరకూ ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ తమ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ముందు జాగ్రత్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ భయం పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్లు వాళ్లను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరప్ లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్లడానికి డిసైడ్ అయి పోవడం జరిగింది.

 

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్  "నీ కాళ్ళు పట్టుకుంటాం .. అలా చెయ్యద్దు" యూరప్ మొత్తం కరోనా దారుణంగా వ్యాప్తి చెందింది .. ఈ టైమ్ లో వెళ్ళడం చాలా పెద్ద రిస్క్ అని ఫాన్స్ గొడవ చేస్తున్నారు. మరో పక్క ప్రభాస్ మాత్రం షూటింగ్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని యూరోప్ వెళ్లడానికి డిసైడ్ అయిపోయారు అంట. ఇదే తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర ప్రాంతాల్లోని తమ ప్రైవేటు వాహనాలు ద్వారా వెళ్లి పోతున్నట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.

 

మరోపక్క హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో కూడా సిబ్బందిని ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవాలని సూచిస్తున్నారట. తాజాగా ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగస్తులకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించడంతో హైదరాబాద్ నగరంలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: