లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్ తన చిన్న వయసులోనే పలు సినిమాల్లో నటించి బాల నటిగా మంచి పేరు సంపాదించారు. ఆపై పెరిగి పెద్దయిన తర్వాత సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన శృతి, అనంతరం హీరోయిన్ గా మారారు. ముందుగా బాలీవుడ్ లో లక్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన శృతి, ఆపై తెలుగులో నటుడు సిద్దార్ధ సరసన అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా నటి గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్య వస్తావయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి శ్రీమంతుడు, మాస్ రాజా రవితేజ తో బలుపు సినిమాల ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించారు శృతి. ఇక ప్రస్తుతం రవితేజతో కలిసి ఆమె నటిస్తున్న క్రాక్ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది. అయితే నటిగా ఆమె తొలిసారిగా బాలీవుడ్ లో నటించిన లక్ అనే సినిమాలో శృతి బికినీ ధరించి అప్పట్లోనే అభిమానులు చూపులు తనవైపు తిప్పుకున్నారు. 

 

అనంతరం తెలుగు, తమిళ సినిమాల్లో పాపులర్ నటిగా పేరు సంపాదించిన అనంతరం, పలు ఫోటోషూట్స్ లో బికినీలు ధరించి ఫ్యాన్స్ కు తన మతిపోగొట్టే అందాలతో పిచ్చెక్కించింది శృతి. స్వతహాగా ఎంతో అందగత్తె అయిన శృతిని బికినీలో చూసిన ఆమె అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బికినీ ధరించడానికి సిద్ధం అని శృతి అక్కడక్కడా కొన్ని ఇంటర్వ్యూ ల్లో చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు మరొక తమిళ సినిమాలో కూడా నటిస్తున్న శృతి, రాబోయే రోజుల్లో ఇంకెన్ని విజయాలు అందుకని ఎంత మేర తన అభిమానులను అలరించి ముందుకు సాగుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: