పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. గతేడాది బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ మూవీ అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మొన్న రిలీజ్ చేసిన ఈ సినిమా యూనిట్, ఆ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించచడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

 

నివేత థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీత తరంగం ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా, దిల్ రాజు, బోనీకపూర్ కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా అధికారిక ఆడియో రైట్స్ ను తాము కొనుగోలు చేసినట్లు ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ నిన్న సాయంత్రం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అతి త్వరలో తమన్ స్వరపరిచిన వకీల్ సాబ్ లోని సాంగ్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరించనున్నాయి, అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఆదిత్యా మ్యూజిక్ వారు తమ అధికారిక సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

 

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని ఈనెల 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే రెండో వారంలో రిలీజ్ చేయనున్నారు. మరి పవన్ రీఎంట్రీ మూవీ గా రాబోతున్న ఈ వకీల్ సాబ్ ఎంత మేర సక్సెస్ ని అందుకుని ఆయన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందో చూడాలి.....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: