నయనతార ప్రస్తుతం ఈ పేరు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. కేరళకు చెందిన ఈ భామ‌ సినిమాల్లోకి రాకముందు లోకల్ ఛానల్లో యాంకర్ గా ప‌ని చేసుకుంటా ఉండేది. 2005లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఆమె నటించిన చంద్రముఖి సినిమా ఆమెను ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ పాపులర్ అయింది. అంతకుముందు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన గజిని సినిమా ఆమెను సౌత్ ఇండియన్ సినిమా రంగానికి పరిచయం చేసింది. ఇక అక్కడ నుంచి తెలుగు తమిళ కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నయనతార దూసుకుపోతోంది. అందుకే ఆమెకు లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు ఇచ్చేశారు. ప్రస్తుతం సంబంధం లేకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు సూపర్ హిట్ సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా శిఖరాగ్రాన ఉంది. 

 

నయనతార తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్  లాంటి జూనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ ఆడిపాడింది. ఆమె ఇప్పుడు ఇంత సూపర్ స్టార్ అవ్వడానికి ప్రధాన కారణం తమిళంలో ఆమె కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలు అని చెప్పాలి. ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న క్రమంలో తమిళంలో బిల్లా సినిమాలో బికినీ వేసి కుర్రకారు మతులు పోగొట్టేసింది. అజిత్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా సినిమాలో నయనతార బాడీ అంతా కనపడేలా బికినీ వేసుకుని తన ఒంపు సొంపులు చూపిస్తూ వయ్యారాలు ఒలకపోస్తూ నడిచి వస్తున్నా తీరుకు కుర్రకారు ఫిదా అయిపోయారు. 

 

అప్పటి నుంచి ఆమె అంటే ఎంతో మంది ఇప్పటికీ పడి చచ్చి పోతున్నారు. దీనికి ప్రధాన కారణం నయనతార బికినీలో తన అందచందాలు చూపించడమే. నయనతార బికినీ వేసిన అప్పటి నుంచి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్నా ఆమె అందాలు అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పటికీ ఆమెను ఆరాధన తారగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు నయనతార ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్లకు పైగా డిమాండ్ చేసే రేంజ్‌కు ఎదిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: