టాలీవుడ్ లో ఇలియానా ఒక వెలుగు వెలిగింది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది మెప్పించింది. భారీ పారితోషికం తీసుకుని స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఏమైందో తెలియదు గాని ఆమె ఒక్కసారిగా  కనుమరుగు అయిపోయింది. అవకాశాల కోసం ఎంత మంది వద్దకు వెళ్ళినా సరే పెద్దగా ఆమెను అవకాశాలు వరించలేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు ఆ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి కూడా. మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికి తెలుసు. 

 

ఆ తర్వాత ఆమె డిమాండ్ కూడా భారీగా పెరిగింది. అగ్ర హీరోల సరసన ఆమెకు అవకాశాలు వచ్చాయి. అల్లు అర్జున్ తో చేసిన జులాయి సినిమా కూడా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆమె అవకాశాల కోసం ఇబ్బంది పడుతుంది. ఒక్క అవకాశ౦ వచ్చినా చాలు అనుకుంటుంది. కొన్ని సినిమాల్లో ఆమె బికినీలు కూడా వేసి బాలీవుడ్ ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే పెద్దగా ఫలితం రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె బికినీ తోనే ఎక్కువగా ఫోటోలు పోస్ట్ చేసింది. 

 

బికినీ కోసం బరువు కూడా భారీగా తగ్గింది ఆమె. ముఖ్యంగా తన స్కిన్ షో తన గ్లామర్ తో ఆమె ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఆమె తల రాత మాత్రం మారడం లేదు. మీరు అడిగితే నేను బికినీలు కూడా వేయడానికి రెడీ గా ఉన్నాను అని చెప్పినా సరే దర్శకులు ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. బికినీ లో ఆమె చాలా గ్లామర్ గా ఉంటుంది. అయినా సరే ఆమె కు మరి ఎందుకు అవకాశాలు రావడం లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: