ప్రముఖ సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లో నిన్న అర్ధరాత్రి ఓ పబ్ లో దాడి జరిగిన సంగతి విదితమే. హైదరాబాద్ లోని ఓ పబ్ లో కొందరు దుండగులు ఈ దాడి చేశారు.. స్నేహితుడు,స్నేహితురాలుతో కలిసి రాహుల్ నిన్న రాత్రి ఓ పబ్ కు వెళ్ళాడు. అయితే రాహుల్ తో పాటు పబ్ కి వెళ్లిన యువతీ పట్ల పబ్‌లో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. 

 

దీంతో రాహుల్ హీరోలా వాళ్లను నిలదీయడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఈ గొడవలో ఇద్దరు దాడులు చేసుకునే వరకు వెళ్లారు.. ఈ గొడవలో యువకులు ఇద్దరు బీరు సీసాలు తీసుకొని రాహుల్‌ సిప్లిగంజ్ పై దాడికి దిగారు.. రాహుల్ తలపై బీరు సీసాతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలైయ్యాడు. 

 

తీవ్ర రక్తస్రావంతో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ను గచ్చిబౌలిలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు పబ్ లోని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు తెలిపారు.. దీంతో రాహుల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

కాగా సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ఎంతోమందిని అభిమానులను చేసుకున్నాడు.. ఇక బిగ్ బాస్ 3 లో పాల్గొన్న రాహుల్ తన మెరుగైన ప్రదర్శనతో శ్రీముఖిని వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలిచి బిగ్ బాస్ 3 టైటిల్ గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ 3 టైటిల్ విన్ అయినా సమయం నుండి రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాడు. 

 

ఎప్పుడు పార్టీలలో అమ్మాయిలతో కనిపిస్తూ వార్తల్లోకి ఎక్కేవాడు.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిందాస్ లైఫ్ ని అనుభవిస్తున్నాడు.. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాక బెంజ్ కారు.. ఓ పెద్ద ఇల్లు కొన్నాడు కూడా.. అలాంటి సిప్లిగంజ్ ఇప్పుడు దాడికి గురై ఆసుపత్రి పాలయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: