మెగా స్టార్ గా లక్షలాది మంది అభిమానులు గల చిరంజీవికి ఎన్నో సత్కారాలు జరిగాయి అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ గౌరవాన్ని పొందిన చిరంజీవి కి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. అలాంటి చిరంజీవికి అవమానం జరిగింది అంటూ ఇప్పుడు మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.


ఇక వివరాలలోకి వెళితే హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ క్రిటిక్స్ ఛాయస్ ఫిలిం అవార్డుల పేరిట ప్రతి సంవత్సరం తెలుగు సినిమాలకు సంబంధించి అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఈసారి కూడ గత సంవత్సరానికి సంబంధించిన తెలుగు సినిమాలకు సంబంధించి అవార్డులు ఇవ్వడానికి తమ నామినేషన్స్ ప్రకటించింది. 


ఈ లిస్టులో తెలుగు సినిమాలకు సంబంధించి ఉత్తమ నటుడు విభాగంలో ‘సైరా’ మూవీలో నటించిన చిరంజీవితో పాటుగా ‘జెర్సీ’ సినిమాకు సంబంధించి నాని – ‘మల్లేశం’ సినిమాకు సంబంధించి ప్రియదర్శి – ‘ఓ బేబి’ సినిమాకు సంబంధించి రాజేంద్రప్రసాద్ – ‘ప్రతిరోజు పండగే’ సినిమాకు సంబంధించి రావ్ రమేశ్ ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డుల కోసం ఈ సంస్థ నామినేట్ చేసింది. దీనికి సంబంధించిన న్యూస్ ను పోష్టర్ ను కూడ సోషల్ మీడియాలో షేర్ చేసారు. 


ఇప్పుడు ఈ వ్యవహారం మెగా అభిమానుల దృష్టి వరకు రావడంతో 150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి ఈమధ్యనే పెరులోకి వస్తున్న ప్రియదర్శి ఒకే స్థాయి అని భావించాల అంటూ మెగా అభిమానులు మండిపోతున్నారు. అంతేకాదు ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న రావ్ రమేశ్ రాజేంద్రప్రసాద్ లతో చిరంజీవిని ఉత్తమ నటుడు విభాగంలో కలపడం ఏమిటి అంటూ మెగా అభిమానులు అసహనానికి గురి అవుతున్నారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రకటించిన నామినేషన్స్ ను లోతుగా పరిశీలిస్తే హీరోయిజానికి సంబంధం లేకుండా నిజమైన నటనా ప్రతిభ ఉన్న వారిని గుర్తించడానికి ఇలా ఈ అవార్డ్ కు నామినేట్ చేసారు అని భావించాలి. అయితే అనుకోకుండా ఈ లిస్టులో ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి చేరడం అనుకోకుండా పొరపాటున జరిగిందా లేదంటే చిరంజీవి స్థాయిని   తగ్గించడానికి ఉద్దేశ్యపూర్వకంగా చేసిందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: