మెగా బ్రదర్ గా మెగా అభిమానులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు గల నాగబాబు తన అన్న చిరంజీవి ని అదేవిధంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను విపరీతంగా ప్రేమిస్తాడు. దీనికితోడు చిరంజీవి మెగా స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్న రోజులలో నాగబాబు ద్వారా మాత్రమే మెగా అభిమానులు చిరంజీవితో కనెక్ట్ కాగలిగే వారు. 

 

చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో నాగబాబు కోస్తా జిల్లాలలో పర్యటనలు చేస్తూ కాపు సామాజిక వర్గ ఓట్లను చిరంజీవి అభిమానుల ఓట్లను ప్రజారాజ్యం కు పడే విధంగా చాల కృషి చేసాడు. ‘ప్రజారాజ్యం’ ఓటమి తరువాత కేవలం తన బుల్లితెర కార్యక్రమాలకు సీరియల్స్ కు పరిమితమైన నాగబాబు ఇప్పుడు ‘జనసేన’ లో కూడ కీలక పాత్రను పోషిస్తూ పవన్ కు చేదోడువాదోడు గా ఉంటున్నాడు. 

 

ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య నాగబాబు ఒక ఇంటర్వ్యూలో అనుకోకుండా చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ కామెంట్స్ ఒక విధంగా చిరంజీవి స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయి అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 

 

రాజకీయాల్లో తన కంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని  చిరంజీవి అనుకున్నారని నాగబాబు కామెంట్ చేసాడు. అయితే చిరంజీవి ఎప్పుడు తనకు తానుగా అలాంటి కామెంట్స్ చేయలేదు. అంతేకాదు తమ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అంటూ అనేక సార్లు చిరంజీవి పవన్ గురించి చెప్పాడు కాని తనకన్నా రాజకీయాలలో అద్భుతాలు పవన్ చేస్తాడు అని చిరంజీవి ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. ఇలాంటి పరిస్థితులలో నాగబాబు చేసిన కామెంట్స్ ప్రకారం నిజంగా చిరంజీవి తనకన్నా అద్భుతంగా పవన్ ప్రజాసేవ చేయగలడు అని భావిస్తే అది తాను రాజకీయనాయకుడుగా ఫెయిల్ అయ్యాను అన్న విషయం తనకు తాను గా ఒప్పుకున్నట్లేనా అంటూ నాగబాబు యాధృశ్చికంగా చేసిన కామెంట్స్ పై రంద్రాన్వేషణ కొనసాగిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: