అనుష్క ఎంత పెద్ద టాప్ హీరోయినో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే సూప‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌యిన ఈ భామ మంచి మంచి చిత్రాల్లో న‌టించి  స్టార్ స్టేట‌స్‌ని సంపాదించింది. ఆమె ప‌ర్స‌నాలిటీ, హైట్ మ‌రే హీరోయిన్ డామినేట్ చెయ్య‌లేనంత బావుండేది. ఓ అరుంధ‌తి పాత్ర‌లోనైనా, దేవ‌సేన పాత్ర‌కైనా, రుద్ర‌మ‌దేవిగానైనా ఇలా ర‌క ర‌కాల  పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది ఈ భామ‌. మ‌రి ఇంత మంచి పాత్ర‌ల్లో న‌టించిన అనుష్క కూడా స్టార్టింగ్‌లో ఎక్స్‌పోజింగ్ పాత్ర‌లు చేసింది. వాటిలో బిల్లా చిత్రంలో ప్ర‌భాస్ ప‌క్క‌న బికినీ వేసుకుని అద‌ర‌గొట్టింది. ఇక అదే చిత్రంలో న‌టించిన మ‌రో హీరోయిన్ న‌మిత. ఈ భామ సొంతం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌యింది. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించింది కానీ ఆశించినంత హిట్ కాలేక‌పోయింది ఈ భామ‌. వెంక‌టేష్ స‌ర‌స‌న జెమిని చిత్రంలో న‌టించి మంచి ఒంపుసొంపుల‌ను ఆర‌బోసింది ఈ భామ‌. త‌ర్వాత అనుకోకుండా స‌డెన్ గా ఈ భామ ప‌ర్స‌నాలిటీలో తేడా వ‌చ్చేసింది. బాగా లావుగా అవ్వ‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి.

 

అయితే లావు అయిన త‌ర్వాత కూడా ఈ భామ బాల‌కృష్ణ‌తో క‌లిసి సింహ చిత్రంలో ప్ర‌భాస్ తో క‌లిసి బిల్లా చిత్రంలో న‌టించింది.  అంత ప‌ర్స‌నాలిటీ ఉన్నీ భామ బికినీ వేసి బిల్లాలో కుర్రాళ్ళ మ‌న‌సుల్లో సెగ‌లు పుట్టించింది. ఇక ఈ చిత్రంలో బ్లాక్ క‌ల‌ర్ బికినీ వేసి ఆమె అంద‌చందాల‌ను ఆర‌బోసింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కి బికినీ లో ఆమె న‌డుచుకుంటూ వ‌స్తుంటే థియేట‌ర్‌లో చూసే ప్రేక్ష‌కులు క‌నురెప్ప‌వేయ‌డం కూడా మ‌ర్చిపోయారు. ఇక ముందుగా ఆమె వ‌చ్చి స్విమ్మింగ్‌పూల్‌లో దిగుతుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్‌లో సేమ్ బ్లాక్ క‌ల‌ర్ బికినీలో అనుష్క వ‌చ్చి క‌నుల‌విందు చేసింది. ఆమె అందాలు ఒక‌ర‌కంగా క‌నిపిస్తే అనుష్క అందాలు ఒక‌ర‌కంగా క‌నిపించాయి. ఇక వీరిద్ద‌రూ స్విమ్మంగ్‌ల పూల్‌లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆ సీన్ కోసం ఆ సినిమా టీవీల్లో ఎన్నిసార్లు వేసిన చూసే కుర్రాళ్ళు చాలా మందే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: