ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ రెండు నెలల క్రితమే తొలిసారిగా అస్తిత్వంలోకి వచ్చింది. ఇది చలి వాతావరణంలో యాక్టివ్‌గా మారుతుదని తెలుస్తోంది. వేడి వాతావరణంలో ఈ వైరస్ అంత త్వరగా వ్యాప్తి చెందదు. కరోనా జలుబు  భిన్నమైనది జ్వరం, దగ్గు, ఆయాసం  ఎక్కువగా ఉంటాయి ముక్కు కారడం,  తుమ్ములు తక్కువే వ్యాధి సోకినవారిలో చనిపోతున్నది 2 నుంచి 3 శాతమే. పిల్లల్లో మరణాల రేటుకు సంబంధించి డేటా అందుబాటులో లేదు. అయితే పిల్లలు, గర్భిణులకు ముప్పు ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో బాధితుల సంఖ్య 29కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్‌ పర్యాటకులు కాగా.. వారికి డ్రైవర్‌గా పనిచేసిన రాజస్థాన్‌వాసి కూడా వైరస్‌ బారిన పడ్డాడు.

 

ఢిల్లీ, జైపూర్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లోకూడా కేసులు నమోదు అవుతున్నాయి.  ఏపీలో కూడా ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో 11మంది అనుమానితులు వ్యాధి లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. విశాఖపట్నంలో 5, శ్రీకాకుళంలో 4, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున అనుమానిత కేసులు నమోదయ్యాయి.  కొంతమందికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి..  రిపోర్టులు వచ్చేవరకూ వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించనున్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇక కరోనా కు మందు లేదు.. మనం జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అంటున్నారు సినీ ప్రముఖులు ఇతర సెలబ్రెటీలు. తాజాగా సామాజిక సృహ ఉన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ సంచలన కామెంట్ చేశారు.

 

ఇది ఒక వైరస్ సెకన్లలో ఎక్కడైనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అన్నారు.  అయితే మన పురాణ సంస్కృతి సంప్రదాయ పద్ధతులను పాటిస్తే ఎంతటి రోగమైనా క్షణాల్లో ఉపశమనం కలుగుతుందని అంటున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.  కరోనా గురించి మాట్లాడుతూ.. ‘'వేడినీళ్లలో నిమ్మకాయ రసం పిండుకొని తాగితే కరోనా వైరస్ రాదని'’ సెలవిచ్చాడు. ఈ విషయాన్ని చైనాకు చెందిన బీజింగ్ మిలిటరీ హాస్పిటల్ సీఈవో చెన్ హోరిన్ తెలిపాడని వివరించాడు. నిమ్మలో ఉండే విటమిన్ సి తో ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: