టాలీవుడ్ లో అతి తక్కువ టైం లోనే పాపులర్ అయిన ఓ యువ హీరో వరుసగా మూడు బ్లాక్‌ బ‌స్టర్ హిట్లు సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టైమ్ లోనే ఏ హీరోకు రాణి క్రేజ్ ఆ యువ హీరో సొంతం కావడంతో అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని... బహిరంగ వేదికలమీద సైతం పెద్ద హీరోలు... సీనియర్లు అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడని.... బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే విమర్శలు వినిపించాయి. సినిమాల్లో అతడు చేసిన ఓవరాక్షన్... స్టైల్ కు... యూత్ చాలామంది ఆ హీరోకు అభిమానులు అయిపోయారు. అయితే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఆ హీరో సీన్ రివర్స్ అవ్వటం స్టార్ట్ అయ్యింది.



తాజాగా అత‌డు న‌టించిన సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. రిలీజ్‌కు ముందే ఏకంగా రు. 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి ఆట‌కే ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కేవలం వారం రోజుల‌కే ఎత్తేశారు. ఫైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ కూడా ముగిసింది. మొత్తం రు.10 కోట్ల షేర్ రాగా రు. 20 కోట్ల న‌ష్టం వ‌చ్చింది. సినిమాలంటే ఎంతో అభిరుచితో ఉండే ఓ సీనియ‌ర్ నిర్మాత తీసిన ఈ సినిమా ఆయ‌న జీవితాన్ని రోడ్డు పాలు చేసేసింది. రు. 20 కోట్ల న‌ష్టంతో చాలా వ‌ర‌కు ఆస్తులు అమ్మేసి మ‌రీ ఆయ‌న కుదేలైపోయాడు.



స‌ద‌రు హీరోకు ప‌ట్టున్న నైజాం ఏరియాలోనూ కేవ‌లం రు 3.85 కోట్లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే మూడు వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న స‌ద‌రు యంగ్ హీరోకు ఈ సినిమాతో వ‌రుస‌గా నాలుగో ప్లాప్ రావ‌డంతో ఈ సినిమాపైనే ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆ హీరో క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ఉన్న ప‌రువూ గోవింద అవ్వ‌డంతో ఇప్పుడు అత‌డికి అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాత‌లు, అత‌డితో సినిమాలు చేయాల‌నుకుంటోన్న వారు కూడా వెన‌క‌డుగు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: