రకుల్ ప్రీత్ సింగ్.. పాపం ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే.. సినిమాల మీద సినిమాలు హిట్ కొట్టింది.. ఎంతో అందం ఉంది. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఈ భామ ఉంటుంది. కానీ ఎం లాభం... ఇప్పటికే ముసలి మన్మథుడుతో నటించి ముసలి భామ అని అనిపించేసుకుంది.. అదేంటో కానీ ఈ భామకు అసలు సినిమా అవకాశాలే రావటం లేదు.. పాపం.
ఇంకా ఈ విషయంపైనే ఈ భామ ఇటీవలే స్పందించింది. ఆమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటో కుండా బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఆ కారణం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. రకుల్ ప్రీత్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో 90 శాతం అన్నింటిలోనూ ఆమె పాత్ర కంటే కూడా ఆమె గ్లామర్ షోకు సంబంధించిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. అదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది.
మొదట కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన.. ఒకటి రెండు చిత్రాల్లో నటించినా ఆమెను కోలీవుడ్ పట్టించుకోలేదు. దీంతో లాభం లేదనుకుని టాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ భామకు ఇక్కడ కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశాలు మంచి వచ్చాయి. తెలుగు ప్రేక్షకులను తన అందాలతో సొంతం చేసుకుంది. యువ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇది అంత కూడా అతి తక్కువ సమయంలోనే జరిగింది.
ఇప్పుడు లక్కీగా తమిళంలోనే రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్‌తో చేస్తోంది. తెలుగులో మాత్రం మంచి గ్యాప్ వచ్చింది. ఎవరు పాటించుకోవడం లేదు.. దీంతో ఆమె మాట్లాడుతూ.. ఇన్నాళ్లు వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్ధం అయ్యింది.. బికినీలలో కనిపించి టాలీవుడ్ కి బోర్ కొట్టేశా.. అలా చెయ్యడం ఎంత తప్పో ఇప్పుడు అర్థం అయ్యింది..
నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయి.. ఇక నుండి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ మాటలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇప్పుడు నువ్వు వచ్చిన అవకాశాలు వదులుకొని నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తాను అంటే నీకు ఎవరు అవకాశాలు ఇస్తారు ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రకుల్ ప్రీత్ కెరీర్ టాలీవుడ్ లో ఎలా ఉంటుందో చూడాలి.