సినిమా ఇండస్ట్రీలో హీరోల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. ఏ సినిమా అయినా హీరోల పేరు మీదే ఎక్కువగా ఆడుతుంటాయి. అందుకే వారికి పారితోషికాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టాలీవుడ్ నుండి మొదలుకుని బాలీవుడ్, హాలీవుడ్ వరకి ఇదే పరిస్థితి. అంతటా ఒకేలా ఉంటుంది. హాలీవుడ్ లో కొద్దిగా మార్పు కనిపించినా..అది కూడా చాలా తక్కువే. అయితే హీరోలతో సమానంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్.

 

 

కంగనా రనౌత్ కి బాలీవుడ్ క్వీన్ గా పేరుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కూడా మంచి విజయాలు దక్కించుకుంది. ఆమె చేసిన క్వీన్, మణికర్ణిక చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ప్రస్తుతం కంగనా తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో దివంగత నేత జయలలిత బయోపిక్ గా రాబోతున్న చిత్రం ‘తలైవి’ చిత్రంలో నటిస్తుంది.

 

బాహుబలి విజయేంద్రప్రసాద్ అందించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించబోతుందట. అయితే ఈ సినిమా బడ్జెట్ సుమారుగా వందకోట్లు అని చెప్తున్నారు.

 

ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి వందకోట్లు రెవెన్యూ రావడం సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. కానీ కంగనాకి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇది సాధ్యమే అని చెప్తున్నారు. అంతే కాదు తలైవి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అవనుందట. సో వందకోట్లైనా ఈజీగా రికవరీ అవుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: