బాలీవుడ్ లో ఈ మద్య స్టార్ హీరోలు, విలన్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు.  బాలీవుడ్ లో రణదీర్ కపూర్ కూతుళ్లు కరీష్మాకపూర్, కరీనా కపూర్ హీరోయిన్లు గా పరిచయం అయ్యారు.  తర్వాత అనీల్ కూపూర్ కూతురు సోనమ్ కపూర్.. శత్రుఝ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా హీరోయిన్లుగా మారారు.  ఆ తర్వాత కూడా కొంత మంది స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ విలన్, కమెడియన్ శక్తీ కపూర్ కూతురు శ్రద్దా కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ అమ్మడి అందాలు... నటనకు దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు.  వరుసగా ఛాన్సులు వస్తున్న తరుణంలో ఆ మద్య సుజిత్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘సాహెూ’ చిత్రంలో నటించింది.  

 

పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయినప్పటికీ ఎక్కడా హిట్ మాట రాలేదు.  పెట్టిన పెట్టుబడి భారీగా నష్టాలు వచ్చాయని టాక్ వచ్చింది.  సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ నిర్మిస్తోన్న 'సాహో' జోడీగా ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది శ్రద్దా కపూర్ మంచి పేరు సంపాదించింది.  తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు  బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తోంది. హిందీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్న ఈ సమయంలో సౌత్ సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కొంత మంది టాలీవుడ్ నిర్మాతలు శ్రద్దాకపూర్ ని కలిసినప్పటికీ ఏవో చిన్న కారణాలు చెప్పి తప్పించుకుందని టాక్ వినిపిస్తుంది.

 

ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా మొహం చాటేస్తుందట. ఏదోలా ఆమెను కొందరు నిర్మాతలు కలిస్తే వారికి ఏదో కారణం చెప్పి నో చెబుతుందట.  చాలా మంది తెలుగు హీరోయిన్లు సైతం తెలుగు లో మంచి క్రేజ్ వస్తే బాలీవుడ్ జంప్ అవుతున్నారు.  తెలుగులో ఈమె ఒక్క చిత్రంలోనే నటించినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సౌత్ చిత్రాలకు లకు సరిగ్గా సెట్ అయ్యే ఫీచర్స్ ఈ అమ్మడిలో ఉన్నాయంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: