అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లకు ఆమధ్య చాల గ్యాప్ కొనసాగింది. అయితే బన్నీ తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని పవన్ అభిమానులతో రగడ అనవసరం అని భావించి చివరకు పవన్ తో తన దూరాన్ని తగ్గించుకునే విధంగా గత కొంతకాలం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో పవన్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఫలితం బట్టి బన్నీ నిర్ణయాలు ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే మూవీ చేయడానికి అంగీకరించి దానికి సంబంధించిన అధికార ప్రకటన కూడ ఇప్పించాడు. 


ఒక మోటార్ బైక్ దొంగతనం చుట్టూ తిరిగే ఈ మూవీ కథ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది. వాస్తవానికి బన్నీ సుకుమార్మూవీ కన్నా ముందుగా ఈ మూవీని ప్రారంభిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సుకుమార్ కు బన్నీ ఇచ్చిన మాట కోసం ఈ మూవీని వెనక్కు తీసుకువెళ్ళాడు. ఇలాంటి పరిస్థితులలో ‘ఐకాన్’ మూవీ ప్రాజెక్ట్ ‘వకీల్ సాబ్’ ఫలితం పై ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.


సాధారణంగా అల్లు అర్జున్ ఒక డైరెక్టర్ పరాజయాల బాటలో ఉంటే అతడు చెప్పే కథలు వినడానికి కూడ పెద్దగా ఆసక్తి కనపరచడు. ఇలాంటి పరిస్థితులలో వేణు శ్రీరామ్ ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ‘ఐకాన్’ కథ ‘వకీల్ సాబ్’ చుట్టూ తిరగడం ఒక విధంగా వేణు శ్రీరామ్ కు టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. పవన్ సినిమాల పై అంచనాలు విపరీతంగా ఉంటాయి. అలాంటి అంచనాలను చేరుకోవడంలో త్రివిక్రమ్ కూడ పొరపాట్లు చేసాడు. ఇలాంటి పరిస్థితులలో వేణు శ్రీరామ్ కెరియర్ ను శాసించే సినిమాగా ‘వకీల్ సాబ్’ మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ఫలితం పవన్ కన్నా వేణు శ్రీరామ్ కు పరీక్షగా మారిపోయింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: