ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా భయం పట్టుకుని జనాలు భిక్కు భిక్కుమంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా కరోనా పై జోకులు వేసినా.. ఎంతో సీరియస్ అవుతున్నారు.  ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరోనాపై ఇలాంటి పిచ్చి సెటైర్లు వేస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎవరు ఎన్ని చెప్పినా కొంత మంది పందా మాత్రం మార్చుకోరు.. కరోనాపై టిక్ టాక్ లు చేస్తూనే ఉన్నారు.  ఫన్నీ వీడియోలు చేస్తూ జనాలను రెచ్చగొడుతున్నారు.  అయితే కొంత మంది సెలబ్రెటీలు మాత్రం కరోనాపై తీసుకోవాలసిన జాగ్రత్తలు చెబుతూ సామాజిక సేవలో తమవందు బాధ్యత నిర్వహిస్తున్నారు. 

 

ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వ్యాధి వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జన తెలంగాణ రైట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి ప్రత్యేక మూత్రశాల లేకపోవడంతో అతడు కామన్‌ టాయ్‌లెట్ల వద్దకు వెళ్తుండడంతో ఇతర రోగులు భయాందోళనకు గురవుతున్నా రని పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని హెచ్చార్సీని తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది.

 

ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ రైట్స్ సొసైటీ దాఖలు చేసింది. వ్యాధి సోకిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విన్న వించింది.  దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతూ ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటే తాను మాత్రం వెల్ కమ్ కరోనా అంటూ వ్యంగ్యమైన వీడియో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు కరోనాను పరిశుభ్రతతో రూపు మాపొచ్చని ఇది అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని వారు కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: