వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేశారు.  అందులో జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దొరబాబు, పరదేశి సెక్స్ రాకెట్‌లో దొరకడం సంచలనంగా మారింది.  ఇండస్ట్రీలో వీళ్ల గురించి చర్చ బాగానే జరుగుతుందిప్పుడు. అంతే కాదు వీళ్లేనా ఇంకా ఎవరైనా ఈ స్కామ్‌లో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు పోలీసులు.   ఒక మహిళతో రాసలీలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తనను వదలేయాలని ఇద్దరూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. అయితే అచ్చం దొరబాబులా ఉండే ఆర్టిస్ట్ మరొకరు ఉన్నారు. అతని పేరు దావూద్. ఈ క్రమంలోనే అక్కడ దొరికిన నటుడు తాను కాదు అంటూ దావూద్ మీడియాకు తెలిపాడు.  

 

గతంలో హైపర్ ఆది స్కిట్‌లో దావూద్, దొరబాబు కలిసి కవల సోదరులుగా స్కిట్‌ కూడా చేసారు. సెక్స్ రాకెట్‌లో దొరికినది దొరబాబు అయితే.. చాలా మంది దావూద్‌కు ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నారు.  దాంతో ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చాడు దావూద్..  అందరికీ నమస్కారం అండి. ఖైదీ నెం 1, డియర్ కామ్రేడ్, అర్జున్ సురవరం, భీష్మ తదితర సినిమాల్లో ఆర్టిస్ట్‌గా మంచి పాత్రల్లో నటించాను. ఇటీవల నేను దొరబాబు నటించిన వీడియోలు చూశాను.. అతను అచ్చం నా పోలికలతో ఉన్నారు.  దాంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.  అక్కడ పట్టుబడింది నేను కాదు.. దొరబాబు అంటూ క్లారిటీ ఇచ్చాడు.  దయచేసి అర్థం చేసుకుని తన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయొద్దని కోరాడు దావూద్.  

 

దొరబాబు విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. ఆయన విషయంలో ఏం జరగబోతోందో అని మీరు ఎలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తు్న్నారు.  కానీ ఎప్పుడూ ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో నేను కలగజేసుకున్నది లేదు. ఇలాంటి చీప్ పబ్లిసిటీలు నేను చేయను.  ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది.  ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో పోస్టులతో తన కుటుంబం కూడా బాధ పడుతుందని చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: