మెగా స్టార్ చిరంజీవి,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.  ప్రస్తుతం హైదరాబాద్ లో ని రామోజీ ఫిలిం సిటీ లో రెండవ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇక కొద్దీ రోజుల క్రితం ఓ ఈవెంట్ లోఅనుకోకుండా చిరంజీవిసినిమా టైటిల్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ టైటిల్ ఏంటో అందరికి తెలిసిపోయింది. ఇక ఎలాగూ టైటిల్ బయటికి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను  కూడా  విడుదలచేయాలని కొరటాల డిసైడ్ అయ్యాడట.
 
మార్చి 10న హోలీ సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయం లో ఇంతవరకు క్లారిటీ లేదు. చిరు కు జోడిగా త్రిష నటించనుందని వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది.
 
ఇక సినిమాల్లోకి  రీఎంట్రీ ఇచ్చాక  వరుస గా బ్యాట్ టు బ్యాక్ హిట్లు కొట్టి చిరంజీవి ఫామ్ లో ఉండడం అలాగే ఇప్పటివరకు అపజేయమే లేకుండా టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నకొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నఈ ఆచార్య పై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. ప్రస్తుతం హరీష్ , చిరు కోసం  కథను సిద్ధం చేసే పనిలో వున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: